Tuesday, April 23, 2024

వివక్ష మూల్యం రూ.15వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వ్యవహరించిన వివక్ష మూలంగా 2022-23వ ఆర్థిక సంవత్సరంలో రుణాల సేకరణలో రూ.15,033 కోట్లను నష్టపో వాల్సి వచ్చింది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరంలో తెలంగాణ రా ష్ట్రం అధికారికంగా, న్యాయంగా, ధర్మంగా రూ. 53,970 కోట్ల నిధులను రుణాల రూపంలో సమీకరించుకునే అవకశం ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం అనేక పనికిమాలిన రూల్సు ను తెలం గాణ రాష్ట్రంపై రుద్దడం మూలంగా వేలాది కోట్ల రూపాయల నిధులను నష్టపోవాల్సి వచ్చిందని ఆ ర్థ్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. మార్కెట్ బారోయిం గ్స్, సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి సేకరించిన నిధులను కలుపుకొ ని తెలంగాణ రాష్ట్రానికి కేవలం 38,937 కోట్ల రూపాయల నిధులు మాత్రమే వ చ్చాయి.

దీంతో తెలంగాణ రాష్ట్ర అప్పులు జిఎస్‌డిపిలో 23.8 శాతం నుం చి 20 శాతానికి తగ్గిపోయి ఉం టాయని అధికారవర్గాలు ఆశా భావాన్ని వ్యక్తం కేంద్ర ప్రభుత్వం ఒక్క తెలం గాణ రాష్ట్రంపైనే లేనిపోని ఆం క్షలు విధించ డం మూలంగా ఇంతటి భారీ నష్టాన్ని చవిచూ డాల్సి వచ్చిందని ఆ అధికారు లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశా రు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం తెలం గాణ రాష్ట్ర రుణాలు గత జనవరి నెలలోని లెక్కల ప్రకారం 23.8 శాతానికి పరిమితంగా ఉన్నాయని వివరిం చారు. తెలంగాణ రాష్ట్రానికి 2022-23వ ఆ ర్థ్ధిక సంవత్సరంలో 2.56 లక్షల కోట్ల రూపాయల ను బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకోగా అందులో సుమారు 54 వేల కోట్ల రూపాయల నిధులను న్యాయంగా, చట్టబద్దంగా సెక్యూరిటీ బాండ్ల వేలంలో సేకరిం చుకోవాల్సి ఉంది.

ప్రస్తుత ఆర్ధి క సంవత్సరం మ రో అయిదు రోజుల్లో ముగుస్తున్న దశలో రాష్ట్ర అప్పులు 38,937 కోట్ల కు పరిమితం అయ్యాయ ని, దీంతో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం ఈ నెలాఖరునాటికి తెలంగాణ రాష్ట్ర అప్పులు 20 శాతానికి లోబడే ఉంటాయని, ఎందుకంటే ఏకం గా 15,033 కోట్ల రూపాయల రుణాలను తెచ్చుకోకపోవడం మూలంగానేనని వివరించారు. దీంతో ఎఫ్‌ఆర్‌బి ఎం చట్టం ప్రకారం ఒక రాష్ట్రం అప్పులు ఆ రాష్ట్ర జిఎస్‌డిపిలో 20 శాతానికి మిం చకుండా ఉండా లనే నిబంధనలను ఒక్క తెలంగా ణ ప్రభుత్వమే పాటించినట్లయ్యిందని సగర్వంగా చెప్పారు. చివరకు ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని రూ పొందించిన కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్న సెక్యూరిటీ బాండ్ల వేలంలో 15 రాష్ట్రాలకు అనుమతులిచ్చారు. వచ్చే మంగళవారం నిర్వహించబోయే వేలంలో 40,713 కోట్ల 72 లక్షల రూపాయల రుణాల సేకరణకు ఆర్‌బిఐ 15 రాష్ట్రాలకు అనుమతులు ఇచ్చింది.

ఇందులో గుజరాత్ వెయ్యి కోట్ల రుణాల సేకరణకు రెగ్యులర్ పర్మిషన్ ఇస్తూనే ఒకవేళ ఇంకా అదనంగా నిధులు ఆవసరమవుతాయేమోనని మరో వెయ్యి కోట్ల నిధులను అప్పు తెచ్చుకోవడానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక అనుమతులను కూడా ఆర్‌బిఐ మంజూరు చేసింది. అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఆరు వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చిన ఆర్‌బిఐ అదనంగా మరో వెయ్యి కోట్లను అప్పుతీసుకోవడానికి కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పెద్దలతో సఖ్యతగా, వారి అడుగులకు మడుగులు వత్తితే అన్ని రకాల నియమ నిబంధనలను బ్రేక్ చేసి ఆదుకుంటారని, లేకుంటే ఆర్ధికంగా దెబ్బతీస్తారని తెలంగాణ రాష్ట్ర విషయంలో మరోసారి రుజువు అయ్యిందని ఆ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. బాండ్ల వేలంలో పాల్గొంటున్న 15 రాష్ట్రాలన్నీ ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని దాటి అప్పులు చేశాయని, ఆ రాష్ట్రాలన్నీ 25 శాతం నుంచి 54 శాతం వరకూ అప్పులు చేశాయని,

అయినప్పటికీ ఆర్‌బిఐ మళ్ళీ వేలంలో పాల్గొనే అవకాశాలు కల్పించిందని, అంతటి ఉదారత లేకపోయినా కనీసం చట్ట ప్రకారమైనా తెలంగాణకు అనుమతులు ఇచ్చి ఉన్నట్లయితే రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసుకునే అవకాశాలుండేవని వివరించారు. వాస్తవానికి ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం దేశం మొత్తం జిడిపిలో 60 శాతానికి మించి అదనంగా అప్పులు చేయకూడదని 2017వ సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే రూపొందించిందని, ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జిడిపిలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని వివరించారు. అదే చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా జిఎస్‌డిపిలో 20 శాతానికి మించి అప్పులు చేయకూడదనే నిబంధన ఉందని వివరించారు. ఈ ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని

అనేక సంవత్సరాలుగా యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ వస్తోందని, అంతేగాక కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా, సన్నిహితంగా ఉన్న రాష్ట్రాలకు కూడా ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట పరిధులకు మించి, అంటే తలకుమించిన స్థాయిలో అప్పులు చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇస్తూ వస్తోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. మరో 5 రోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసిపోతుందని, వచ్చేనెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 2023-24వ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 46,317 కోట్ల 68 లక్షల రూపాయలను రుణాలుగా సేకరించాలని లక్షంగా పెట్టుకొందని, ఈ నిధుల సమీకరణకు కేంద్రం సహకరిస్తుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. కనీసం రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని అయినా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం తన వైఖరిని మార్చుకుంటుందా..? లేదా? అనేది వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News