- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కులగణన చేపట్టింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తొలుత కేంద్రం ఇందుకు సుముఖత చూపకపోవడంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. దీంతో తెలంగాణలో తొలిసారిగా కులగణన సర్వే జరిగింది. తాజాగా బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించింది. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
- Advertisement -