Tuesday, April 30, 2024

న్యాయ వ్యవస్థపై కేంద్రం ఒత్తిడి

- Advertisement -
- Advertisement -

ప్రియాంక గాంధీ ఆరోపణ

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత న్యాయ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెడుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. స్వతంత్ర, బలమైన న్యాయ వ్యవస్థను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదిస్తుందా అని ఆమె సందేహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయస్థానాలను అప్రతిష్ట పాల్జేసేందుకు కొన్ని స్వార్థ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా న్యాయవాదులు ఇటీల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంపై ప్రధాని స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ శనివారం స్పందించారు.

ఎన్నికల బాండ్లపై(ప్రజలు దీన్ని బెదిరింపు వసూళ్ల కుంభకోణం అని అంటున్నారు) సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న అనంతరం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే విధంగా లేఖలు రాయించిన తీరు, ప్రధాని నేరుగా తాను ఈ వ్యవహారంలో చొరబడి న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం చూస్తే ఇందులో ఏదో మతలబు ఉందని అర్థమవుతోందని ఎక్స్ వేదికగా ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీ కలవరపాటుకు గురవుతున్నారని కూడా అర్థమవుతోందని ఆమె తెలిపారు. రాజకీయ జోక్యం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశాలు నిర్వహించడం, రాజ్యసభకు ఒక న్యాయమూర్తిని పంపడం, మరో న్యాయమూర్తిని(మాజీ) ఎన్నికలలో అభ్యర్థిగా నిలబెట్టడం, న్యాయమూర్తుల నియామకాలను తన అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించడం, తమకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం వంటివి చూస్తుంటే బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థను మోడీ ప్రభుత్వం ఆమోదిస్తుందా అని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News