Friday, September 13, 2024

ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు: హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేశారు.

అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా ఉందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ అంశంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామని కేంద్రం తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం మూడు వారాలకు వాయిదా వేసింది.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న అదనపు ఎస్‌పి భుజంగరావుకు నాంపల్లిలోని 1వ అదనపు జిల్లా కోర్టు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 31 వరకు కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News