Thursday, January 26, 2023

వంటగ్యాస్ వినియోగదారులపై దొంగదెబ్బ

- Advertisement -

 

వంటగ్యాస్ వినియోగదారులపై దొంగదెబ్బ
వాణిజ్య సిలిండర్ల సబ్సిడీలు
ఎత్తివేత 19కిలోల
సిలిండర్‌పై రూ.200కోత
ఆహార పరిశ్రమ ధరలపై
పెను ప్రభావం ఒక్క
తెలంగాణలోనే ప్రతి నెల
8లక్షల సిలిండర్లు
ఆకస్మిక నిర్ణయంతో పంపిణీ
వ్యవస్థలో గందరగోళం

హైదరాబాద్ : దేశంలో లక్షలాదిమంది వంటగ్యాస్ వినియోగదార్లపై కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. వాణిజ్య అవసరాలకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లపై అందజేస్తున్న రాయితీలను కేంద్ర ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఉపసంహరించుకుంది. కనీ సం ఏవిధమనై నోటీసులు కూడా ఇవ్వకుండా, నామమాత్రంగానైనా ముందస్తు సమాచారం తెలపకుండా ఆకస్మికంగా నిర్ణయం తీసుకుని పంపిణీవ్యవస్థను గందరగోళంలో పడవేసింది. తెలంగాణ ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్ అ సోసియేషన్ ఈ విషయం వెల్లడించింది. గురువారం అ సోషియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల ఉత్పన్నమైన సమస్యలు వివరించింది.

అసోషియేషన్ అధ్యక్షుడు కె.జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వంట శాలలు, ఆహార పరిశ్రమలు, అనేక ఇతర పరిశ్రమలకు ఎల్‌పిజి జీవనాధారంగా ఉందన్నారు. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పి జి)ను ప్రాథమిక ఇంధనంగా ఉపయోగించే అనేక పరిశ్రమల బడ్జెట్‌పైన ఎల్‌పిజి ధరలు ప్రభావం చూపుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, క్లౌడ్ కిచెన్‌లు, స్ట్రీట్ వెండర్లు, పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇతర పరిశ్రమలు, వివిధ వాణిజ్య సంస్థలకు ప్రతినెల 19కిలోల గ్యా స్‌తో కూడిన వాణిజ్య సిలిండర్లు 8లక్షలు విక్రయిస్తున్న ట్టు తెలిపారు.

భారత పెట్రోలియం గ్యాస్ మంత్రిత్వ శా ఖ ఆదేశాలమేరకు ఈ నెల 8 నుండి పిఎస్‌యు, చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) ఎల్పీజి గ్యాస్‌పై రాయితీలను ఉపసంహరించుకున్నాయని వెల్లడించారు. ముం దస్తు నోటీసు లేకుండా, పంపిణీ దారులకు, వినియోగదారులకు ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎంఒపి, ఎన్జీకి వాణి జ్య ఎల్‌పిజి సిలిండర్ అమ్మకపు ధరపై కొన్ని ఫిర్యాదులు అందాయని, కొన్ని సందర్భాల్లో డొమెస్టిక్ ఎల్‌పిజి ధర కంటే తక్కవగా వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధర పడిపోయిందని, అది ఈ నిర్ణయానికి కారణమైందని తెలుస్తోందన్నారు.

ఒఎంసి పంపిణీ దారులకు లేదా కష్టమర్లకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వనందున, ఈ తొం దరపాటు నిర్ణయం మార్కెట్లో గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు. అందుకే తాము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త విధానాన్ని గ్యాస్ వినియోగదారులందరికీ తెలియజేయాలనుకుంటున్నట్టుగా వివరించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు చెందిన వినియోగదారులను, పంపిణీ దారు లను సంప్రదించకుండా, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అస్థిరమైన పద్ధతిలో వాణిజ్యాన్ని పునర్వవస్థీకరించడానికి, ధరల విధానాన్ని తదనుగుణంగా సర్దుబాటు చేయడానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని తాము ఓఎంసితో చర్చిస్తున్నామన్నారు.

తాము తమ వినియోగదారులకు మీడియా ద్వారా గట్టిహామీ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క వారం లేదా పదిరోజులలో విషయాలు సాధారణ స్థితికి వస్తాయని, అంతరాయాలు లేని గ్యాస్ సరఫరా కోసం తమ బకాయిలను సకాలంలో చెల్లించడం ద్వారా కస్టమర్లందరూ పంపిణీ దారులకు సహకరించాలని అభ్యర్ధిస్తున్నామని తెలంగాణ ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

19 కిలోల సిలిండర్‌పైన రూ.200 సబ్సిడికి చెల్లుచీటి!

వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల సిలిండర్‌పైన కేంద్ర ప్రభుత్వం రూ.200 సబ్సిడీ ఇస్తుందని నగరంలోని ప్రముఖ హోటల్ వ్యాపారి ఒకరు తెలిపారు. సిలిండర్ ధర రూ.1960 ఉండగా దీనిపైన రూ.200 రాయితీ వస్తుందన్నారు. డీలర్ తమకు రూ.1760 ధరతో సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేస్తే ఆదనపు భారం పడుతుందన్నారు. పెరిగిన సిలిండర్ ధర భారం హోటల్‌లోని ఆహా ర పదార్ధాలపైన వేసి వాటి ధరలు పెంచకతప్పదన్నారు. వీధి వ్యాపారులు మొదలుకుని అన్నిరకాల వ్యాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరిగితే ఆ ప్రభావం అంతిమంగా వినియోగదారుపైనే పడుతుందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles