Thursday, May 9, 2024

తెలంగాణలో ఎకరం అమ్మితే ఎపిలో 50 ఎకరాలు కొనొచ్చు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేరస్తుల పరిపాలన సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళగిరిలో టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో బాబు మాట్లాడారు. ఎపిలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. టిడిపి పాలనలో కరెంటు ఛార్జీలు పెంచలేదని వివరణ ఇచ్చారు. నాలుగేళ్లలో వ్యవస్థను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని దుయ్యబట్టారు. తాను ఎక్కడ చూసినా కరెంటు కోతలే కనిపిస్తున్నాయన్నారు. ఓపెన్ మార్కెట్‌లో యూనిట్ కరెంటు రూ.10కి కొంటున్నారని, ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Also Read: బాహుబలి సమోసా..తిన్నవారికి బహుమతి ఎంతంటే…

అసమర్థ సిఎం వల్ల ధరలు పెరిగాయని, ఆదాయం తగ్గిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు భూముల విలువ ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు తెలంగాణలో ఒక ఎవరం అమ్మితే ఎపిలో 50 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. భూముల విలువ తగ్గిందని, రిజిస్ట్రేషన్ విలువ పెరిగిందని, ఎపిలో ప్రస్తుతం ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదని చంద్రబాబు వాపోయారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారని, మానసికంగా దెబ్బతీసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. జే బ్రాండ్‌తో ఇష్టానుసారం ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News