Saturday, July 27, 2024

ఐదేళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: అప్పు చేసి పప్పుకూడు పెట్టేవాడు కావాలా… మంచి చేసే వాడు కావాలా? అని మహిళలలను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సంపాదించి సంక్షేమ కార్యక్రమాలతో మీ ఆదాయాన్ని పెంచే పార్టీ కావాలా? అని అడిగారు. బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. ఎన్నికలు రాగానే మోసగాళ్లు వస్తారని, రకరకాల మాటలు చెబుతారని విమర్శలు గుప్పించారు. చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా అప్పు కింద ఇచ్చే వ్యక్తి జగన్ అని, ఆడబిడ్డలకు పుట్టినిల్లు తెలుగు దేశం పార్టీ అని, డ్వాక్రా సంఘాలకు ఆర్థిక సాయం చేశామని, తాము వడ్డీ లేని రుణాలు ఇప్పించామని, తాము ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఇవాళ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, కొంత మంది గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియడం లేదని, ఐదేళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయని, మహిళల అదృశ్యమైన కేసులు కూడా పెరిగాయని, మహిళలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు చెప్పారు.

వైఎస్‌ఆర్‌సిపి పాలనలో తీవ్రంగా నష్టపోయిన మహిళలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపికి చెందిన నేత తన భూమిని లాక్కున్నారని ఓ మహిళ కన్నీంటిపర్యంతమయ్యారు. రికార్డులు తారుమారు చేసి భూమి కబ్జా చేశారని ఓ మహిళ గోడు వెల్లబోసుకుంది. తన తండ్రి పెన్షన్ తొలగించి ఇబ్బందులు పెడుతున్నారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కారం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News