Saturday, July 27, 2024

12న గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం?!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఇదివరలో అమరావతిలో ప్రమాణస్వీకారం చేస్తారని వార్త వచ్చింది. కానీ తాజాగా ఆయన గన్నవరంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారని వార్త.  ఆయన ప్రమాణస్వీకారానికి కేంద్ర నుంచి, బిజెపి నుంచి అనేక మంది నాయకులు హాజరుకానున్నారు.

కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కేసరపల్లి ఐటి పార్క్ సమీపంలో జూన్ 12న ఉదయం 11.27 గంటలకు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. ఆ ఐటి పార్క్ విమానాశ్రయానికి దగ్గరగా, విజయవాడకు 20 కిమీ. దూరంలో ఉంది. చంద్రబాబు నాయుడు మంత్రి మండలిలో జనసేన ఎంఎల్ఏలు, బిజెపి ఎంఎల్ఏలు స్థానం పొందనున్నారని తెలుస్తోంది. నాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి వేలాది టిడిపి, జనసేన, బిజెపి మద్దతుదారులు హాజరుకానున్నారని సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News