Thursday, April 25, 2024

టెన్త్ ప్రశ్న పత్రంలో మార్పులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో 9,10 తరగతుల వార్షిక పరీక్ష పశ్నాపత్రంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాస రూప ప్రశ్నల సంఖ్యను తగ్గించారు. గతంలో ఒక్కో విభాగంలో రెండు ప్రశ్నలు (ఎ, బి) ఇచ్చి వాటిల్లో ఒకటి రాయాలని మార్పులు చేయగా, మొత్తం ఆరు విభాగాల నుంచి ఆరు ప్రశ్నలు రాయాల్సి ఉండేది. ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు ఉండేవి. తాజా ఉత్తర్వుల ప్రకారం విభాగాలుగా కాకుండా మొత్తంగా ఆరు ప్రశ్నలుంటాయి. విద్యార్థులు ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానం ఇస్తే రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 6 మార్కులు ఉంటాయి. అలాగే స్వల్ప సమాధాన ప్రశ్నలు 6 ఉంటాయి. వీటికి గతంలో 3 మార్కులు ఉంటే, ఇప్పుడు ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు.

అతి స్వల్ప ప్రశ్నలు 6 ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. బహుళ ఐచ్చిక ప్రశ్నలు 20 ఉంటాయి. ఒక్కో దానికి ఒక మార్కు ఉంటుంది. గతంలో ఇచ్చిన మాదిరి ప్రశ్నపత్రం కఠినంగా ఉందని, వ్యాసరూప ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు రాసే సమయం సరిపోదని వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ప్రశ్నపత్రాల విధానంలో మార్పు తెచ్చినట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సామాన్య శాస్త్రం రెండు పరీక్షలను వేరు వేరు రోజుల్లో నిర్వహించాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. సామాన్య శాస్త్రం రెండు పరీక్షల నిర్వహణలో మార్పులకు సంబంధించి ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News