Thursday, May 2, 2024

పాలలో కల్తీకి సెకండ్లలోనే చెక్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పాలలో కల్తీకి సెకండ్ల వ్యవధిలోనే చెక్ పడనుంది. కేవలం 30సెకండ్లలోనే పాల స్వచ్చతను నిర్ధారించే కొత్తపరికరాన్ని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజి పరిశోధకులు అభివృద్ధి చేశారు. 3డి కాగిత ఆధారంతో అనువైన డిజైన్‌తో కూడిన ఈ పరికరంతో గృహాల్లోనే పాల స్వచ్చత పరీక్షలు చేసుకునే అవకాశం కలగనుంది. యూరియా, డిటర్జెంట్లు, సబ్బు, గంజి, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, ఉప్పు వంటి కల్తీతో కూడిన పాలను ఈ పరికరం సెకండ్ల వ్యవధిలోనే గుర్తించగలదు.

పాలతోపాటు నీళ్లు, తాజ పళ్ల రసాలు, మిల్క్‌షేక్స్ వంటి ఇతర ద్రవాలలో కూడా కల్తీని ఇది గుర్తించగలదు. తమిళనాడు ఐఐటి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట ప్రొఫెసర్ డా.పల్లబ్ సిన్హా మహాపాత్ర అధ్వర్యంలో రీసెర్చ్ స్కాలర్లు సుభాషిస్ పటారి డా. ప్రియాంక్ దత్త ఈ పరికరం రూపకల్పనలో కృషి చేశారు. ఈ పరికరం వల్ల పాలకల్తీని అరికట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు మెరుగు పడతాయని డా.పల్లబ్ సిన్హా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News