Monday, March 24, 2025

హన్మకొండలో అర్ధరాత్రి చిరుత హల్‌చల్

- Advertisement -
- Advertisement -

హన్మకొండ జిల్లా కేంద్రంలోని రెడ్డిపురం విజయలక్ష్మి కాలనీలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిరుత పులి సంచరించింది. అక్కడి సిసి కెమెరాలో రికార్డయిన దృశ్యాలను స్థానికులు మీడియాకు విడుదల చేశారు. అర్ధరాత్రి వేళ చిరుత పులి ఒక ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నం చేసిందని వారు తెలిపారు. చిరుత హల్‌చల్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందనే తెలియని భయాందోళనలో ఉన్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ప్రస్తుతం సిసి కెమెరాల్లో రికార్డయిన చిరుత సంచరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News