Tuesday, June 18, 2024

బావను చంపిన బామ్మర్ది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బావను బామ్మర్ధి హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊరేళ్ల గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చేవెళ్ల గ్రామంలో కడమంచి నారాయణ దాస్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. తన బావ నారాయణ దాస్‌తో తూర్పటి భాస్కర్‌కు కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. నారాయణను భాస్కర్ గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ లక్ష్మారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News