Wednesday, April 17, 2024

ప్రియుడితో ఓయో హోటల్‌కు వచ్చింది…. కానీ చివరలో షాకింగ్

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఓయో హోటల్ రూమ్‌లో ఓ మహిళ మృతదేహం అనుమానాస్పదంగా కనిపించిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్‌లోని నలందకు చెందిన జోయా ఖాతూన్ పారాలోని ఓయో హోటల్‌లో ఓ రూమ్ బుక్ చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హోటల్ రూమ్‌కు వచ్చింది. బాయ్ ఫ్రెండ్ వెళ్లిపోయిన తరువాత హోటల్ సిబ్బంది ఆమె రూమ్ డోర్‌ను తట్టారు. జోయా స్పందించకపోవడంతో బలవంతంగా రూమ్ డోర్‌ను ఓపెన్ చేశారు. మహిళ బెడ్ మీద స్పందనంగా లేకుండా కనిపించడంతో పాటు ఆమె నోటి నుంచి రక్తం కారడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం చుట్టూ మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు గుర్తించారు. అతడు బయటకు వెళ్లిన తరువాత ఆమె బయటకు రాలేదని హోటల్ సిబ్బంది తెలిపారు. గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ కోల్‌కత్తా వాసిగా గుర్తించారు. ఆమె అతిగా మద్యం సేవించడంతో చనిపోయిందా? లేక హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News