Thursday, September 18, 2025

పదేళ్లలో అన్ని రంగాల్లో విధ్వంసం: చిదంబరం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మోడీ హయాంలో గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలదేని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత పి చిదంబరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్బంగా చిదంబరం మాట్లాడారు. గడిచిన పదేళ్లుగా అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందని, ధరలు పెరిగిపోయాయని, నిరుద్యోగిత పెరిగిందని, ఆశగా ఎదురుచూసిన యువతకు నిరాశే మిగిలిందని మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని విమర్శలు గుప్పించారు. ధనికుల వల్ల ధనికుల కోసం, ధనికుల చేత అనేలా బిజెపి పాలన ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న ఒక్క శాతం ధనికుల కోసమే బిజెపి ప్రభుత్వ పాలన సాగిందని, నిరుపేదలను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని చిదంబరం ధ్వజమెత్తారు. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News