Tuesday, April 30, 2024

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం పాంచ్ న్యాయ్‌పత్ర పేరుతో ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమం సూత్రాలపై కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గతంలో అభివృద్ధి చేసిందని, మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కొనసాగిస్తామని, కులగణన చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు. పేద మహిళలకు ఏడాదికి రూ. లక్ష అందిస్తామని, కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటామని, కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని, విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని, రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ ప్రకటిస్తామన్నారు.

రైతు రుణమాఫీ
కనీస మద్దత ధరకు చట్టబద్దత
వ్యవసాయ పరికరాలకు జిఎస్‌టి రద్దు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.400 వేతనం
ఎలక్టోరల్ బాండ్స్‌పై విచారణ
పెగాసెస్, రాఫెల్‌పై విచారణ
రైల్వే ఛార్జీలు తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ
కులగణన
50 శాతం రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం
రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేస్తాం
అగ్నీవీర్ స్కీం రద్దు చేయడంతో పాటు పాత పద్దతిలోనే ఆర్మీ రీక్రూట్మెంట్
యువతకు 30 లక్షల ఉద్యోగాల భర్తీ
మహాలక్ష్మీ స్మీంతో ఏడాదికి రూ. లక్ష సాయం

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News