Saturday, April 20, 2024

చైనాలో 33 నగరాల్లో లాక్‌డౌన్..

- Advertisement -
- Advertisement -

బీజింగ్: కొవిడ్ 19 నిబంధనల ప్రకారం చైనా 33నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించింది. సుమారు 65 మిలియన్ల ప్రజలు లాక్‌డౌన్ పరిధిలో ఉన్నారు. రానున్న జాతీయ సెలవు దినాలను పురస్కరించుకుని అంతర్గత ప్రయాణాలపై ఆంక్షలు అమలు చైనీస్ బిజినెస్ మ్యాగజైన్ కైక్సిన్ ఆదివారం కథనాన్ని ప్రచురించింది. 2020లో కరోనా మహమ్మారి తలెత్తినప్పుడు చైనాలోని 103నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేశారు. చైనాలో ప్రస్తుతం కరోనా కేసులు సంఖ్య అతి తక్కువగానే ఉన్నా.. జీరో కొవిడ్ పాలసీ ప్రకారం అధికారులు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. చైనా దేశవ్యాప్తంగా గత 24గంటల్లో 1,552 కొత్త కేసులు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ సోమవారం నివేదించింది. కాగా సెప్టెంబర్ 10నుంచి 12వరకు సెలవు దినాలు కావడంతో ముందుస్తు జాగ్రత్త చర్యలుగా చైనా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవులను పురస్కరించుకుని ప్రజలు భారీస్థాయిలో ప్రయాణాలు కొనసాగించకుండా ఆంక్షలు విధించారు.

China Imposes Lockdown in 33 Cities due to Covid

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News