Thursday, April 18, 2024

చదువు ఆరోగ్యానికి ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

China to allow Indian students to return for studies

భారతీయ విద్యార్థులు తిరిగి రావచ్చు : చైనా

బీజింగ్ /న్యూఢిల్లీ : కరోనా తీవ్రస్థాయి దశలో స్వదేశానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు తిరిగి చైనాకు మళ్లేందుకు వీలేర్పడింది. భారత్‌లో ఉండిపోవల్సిన విద్యార్థులు కొందరిని తిరిగి చైనాలో విద్యాభ్యాసానికి రావడానికి అనుమతిని ఇస్తున్నట్లు చైనా శుక్రవారం అధికారికంగా తెలిపింది . గత ఏడాది తీవ్రస్థాయి కొవిడ్ కారణంగా పలువురు విద్యార్థులు చైనా వీడి భారత్‌కు చేరారు. అయితే వీసా, విమాన ప్రయాణ ఆంక్షలతో వీరు తిరిగి చైనాకు వెళ్లడం కుదరని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ విద్యాభ్యాసం ఎంచుకున్న భారతీయ విద్యార్థుల మానసిక వ్యథను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు అన్ని అంశాలను పరిశీలించుకుని కొందరు విద్యార్థులను తిరిగి చైనాకు అనుమతిస్తామని ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక ప్రతినిధి జావో లిజియన్ శుక్రవారం బీజింగ్‌లో వార్తాసంస్థలకు తెలిపారు.

విద్యార్థుల చదువులకు ఆటంకం తలెత్తకుండా చేసేందుకు తాము ప్రాధాన్యత ఇస్తామని , సంబంధిత అంశంపై తమ దేశం ఉన్నత స్థాయిలో భారతీయ అధికారులతో చర్చించినట్లు, విద్యార్థుల రాకకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. చైనాకు తిరిగివస్తున్న ఇతర దేశాల విద్యార్థుల విషయం వారి పరిస్థితి గురించి సమీక్షించుకుని నిర్ణీత సంఖ్యలోనే ముందుగా భారతీయ విద్యార్థులు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతాయని చైనా తెలిపింది. ఇప్పటికే విద్యార్థులు కొందరు ఇండియా నుంచి రావడం జరిగింది.

అయితే భారత ప్రభుత్వ అధికారుల నుంచి విద్యార్థుల తిరిగి రాకపై పూర్తి జాబితా తమకు అందాల్సి ఉంటుందని, ఖచ్చితంగా తిరిగి విద్యాభ్యాసానికి రావాలనుకునే విద్యార్థులు వారి శారీరక పరిస్థితి ఇతర వివరాలను తమకు భారత్ అధికారికంగా పొందుపర్చాల్సి ఉంటుందని అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. దీని వల్ల ఈ విద్యార్థుల తిరుగుముఖం ప్రక్రియ తేలిక అవుతుందన్నారు. అయితే చైనాలోని కొన్ని నగరాలలో తిరిగి వైరస్ తలెత్తడం పలు ఆంక్షల క్రమంలో ఇండియా నుంచి ఎందరు విద్యార్థులను అనుమతించాల్సి ఉంటుంది? ప్రాంతాల వారిగా వైరస్ పరిస్థితిని బట్టి తిరిగివచ్చే విద్యార్థులు తీసుకోవల్సిన జాగ్రత్తలు వంటి వాటిపై దృష్టి సారిస్తామని, తమకు భారతీయ విద్యార్థులు ఏ కోర్సులు ఏ డిగ్రీల్లో ఉన్న వారైనా వారి భవిష్యత్తు పదిలం అనే వైఖరి ఉందని, అయితే ఇదే క్రమంలొ వారి ఆరోగ్యం వారి క్షేమం కూడా తమకు అత్యంత కీలకమని చైనా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News