Monday, April 29, 2024

మమ్మల్ని తక్కువ అంచనావేయవద్దు

- Advertisement -
- Advertisement -

China's Wang Yi slams US

అమెరికాకు చైనా ఘాటు హెచ్చరిక
తైవాన్ అంశంపై రాజీ ప్రసక్తి లేదు
బైడెన్ స్పందన వెంటనే బీజింగ్ ప్రకటన

బీజింగ్ : చైనాను ఏ శక్తి తక్కువ అంచనా వేయరాదని చైనా తాజాగా అమెరికాపై విరుచుకుపడింది. తైవాన్ విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయి వివాదం రగులుకొంటోంది. చైనా నుంచి అతిక్రమణ జరిగితే తైవాన్‌కు తమ దేశం నుంచి పూర్తి స్థాయిలో సైనిక రక్షణ మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ప్రకటించారు. క్షణాల వ్యవధిలోనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం దీనిపై స్పందించారు. చైనా సర్వసత్తాకత, ప్రాదేశిక సమగ్రత సంబంధిత అంశాలపై చైనా రాజీపడేది లేదని వాంగ్ హెచ్చరించారు. ఎవరైనా చైనా శక్తిని తక్కువ అంచనా వేసుకుంటే అది పొరపాటే అవుతుందని తెలిపారు. చైనా జనం పట్టుదల వారి కృతనిశ్చయంపై ఏ ఒక్కరూ తక్కువ అంచనావేసుకోరాదని వాంగ్ యీ తెలిపారు.

స్వపరిపాలనా దీవికి మద్దతు:  అమెరికా

చైనా గనుక తైవాన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి యత్నిస్తే తమ నుంచి తీవ్ర స్పందనే ఉంటుందని వాషింగ్టన్‌లో బైడెన్ హెచ్చరించారు. ఇటువంటి యత్నాలకు దిగితే తాము తైవాన్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని వివరించారు. తైవాన్ సైన్యానికి తమ మద్దతు అందుతుందని ప్రకటించారు. తైవాన్ స్వయం పాలిత దీవి దేశంగా ఉంది. అయితే చైనా ఎప్పుడూ గిల్లికజ్జాలకు దిగుతోంది. ఇది నిప్పుతో ముప్పుతో చెలగాటమే అవుతుందని బైడెన్ తెలిపారు. తైవాన్‌ను చైనా నుంచి రక్షించేందుకు సైనికంగా జోక్యం చేసుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా బైడెన్ తప్పనిసరిగా అని తెలిపారు. ఈ విధమైన కట్టుబాటుకు తాము దిగామని అన్నారు.

తైవాన్‌పై ఏదో ఓ క్షణంలో తీవ్రస్థాయిలో చైనా దాడి జరుగుతుందని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు పసికట్టాయి. చైనా ఎడారులలో తైవాన్‌పై దాడి వ్యూహాల ఖరారుకు చైనా సైనిక బలగాలు వ్యూహరచనకు దిగాయి. తైవాన్‌కు మద్దతుగా అమెరికా జపాన్‌లు ముందుకు వస్తే దీనిని నివారించేందుకు , అవసరం అయితే ఆయా దేశాల సేనలను దెబ్బతీసేందుకు కూడా చైనా సన్నాహాలు చేపట్టిందని అంతర్జాతీయ వార్తాసంస్థలు తెలిపాయి. ఓ రష్యా ఉక్రెయిన్ మధ్య తీవ్రస్థాయి పోరు ఎంతకూ తేలకుండా ఉన్న దశలోనే ఇటు చైనా తైవాన్ ఘర్షణ జరిగితే అమెరికా ఇతరదేశాల కీలక పాత్ర కూడా ఇందులో చేరి తైవాన్‌కు బాసటగా నిలిస్తే ప్రపంచవ్యాప్త సంక్లిష్టతలు మరింత ముదురుతాయని ఆందోళన వ్యక్తం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News