Saturday, September 14, 2024

వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన చిరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారీ వర్షాలు కురవడంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఎపిలోని విజయవాడలో భారీ ఎత్తున వరదలు ముంచెత్తడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దీంతో వరద బాధితుల ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలు ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు ఇస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.  తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయని చిరంజీవి తన ట్విట్టర్ ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని బాధను వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుందని పిలుపునిచ్చారు.

ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రా లో  ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నానన్నారు. ఈ విపత్కర  పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వరద బాధితులకు సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టిఆర్, బాలకృష్ణ తలో కోటి రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీలు ఎపికి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ ఎపి సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.15 లక్షలు, తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.15 లక్షలు విరాళాన్ని అందించిన విషయం విధితమే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News