Thursday, July 3, 2025

చిట్టెంపాడు పాఠశాలలో విద్యార్ధులు ఫుల్…. మౌలిక వసతులు నిల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/నాంపల్లి : మండలంలోని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయితీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత విద్యా సంవత్సరం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వవరకు 14 మంది విద్యార్ధులు మాత్రమే విద్యాభ్యాసం చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి పట్టుదలతో ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్ధులకు, చిట్టెంపహాడ్ ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధుల మధ్య ఉన్న తేడాను ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రులు గుర్తించే విధంగా ప్రయత్నించడంతో ప్రభుత్వ బడిలోనే ప్రైవేటు బడి కంటే నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందిస్తున్నారని గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడులు మాన్పించి ప్రభుత్వ బడిలో చేర్పించడంతో ప్రస్తుతం చిట్టెంపాడు పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య 40 మందికి చేరింది.

ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మికృషి వల్లనే పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిందని గ్రామస్థులు ఒప్పుకుంటున్నారు. పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెరిగినప్పటికీ పిల్లలకు విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్ డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వలేదని తెలిసింది. బుధవారం మనతెలంగాణ చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్ధులకు పాఠశాల ఆవరణలో మలమూత్ర విసర్జనకు అవసరమైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిసింది. పాఠశాల ఆవరణలో పశువుల పెంట కుప్పలు, కుడితిగోలాలు, గడ్డివాములు, రాళ్ల కుప్పలు, పశువుల పాకలు ఉండడం వల్ల వాసన వస్తుందని బడి పిల్లలు తెలిపారు. బడి చుట్టూ వ్యవసాయ భూములు బహిరంగంగా ఉండడం, పాఠశాల ఆర్ అండ్ బి ప్రధాన రహదారి ప్రక్కనే ఉండడం, పాఠశాలలో ఎలాంటి మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడం వల్ల చేలల్లోకి వెళ్తే భూముల యజమానులు తిడుతున్నారని విద్యార్ధులు బాధగా చెప్పారు.

పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచాలని విద్యాశాఖ అధికారులకు ఎన్ని సార్లు తమ గోడు వెళ్లబోసుకున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదని, కంటి తుడుపు చర్యల కింద అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేయడం, పేపర్లలో వార్తలు వచ్చినందుకే వచ్చామని చెప్పి వెళ్లిపోతుంటారని, తమగోడు పట్టించుకోవడం లేదని గ్రామస్థులతో పాటు విద్యార్ధులు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది అవుతుందని, కాలకృత్యాలు తీర్చుకోవడానికి గ్రామ పంచాయితీలో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగించుకుంటున్నామని, విద్యార్ధులు వ్యవసాయ భూములను ఉపయోగిస్తూ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News