Tuesday, April 30, 2024

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తా

- Advertisement -
- Advertisement -

యంగ్ యాక్టర్ శివ కందుకూరి 2020లో ‘చూసి చూడంగానే’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చారుహాసన్, శ్రియా శరణ్‌తో కలిసి నటించిన ‘గమనం’ సినిమా అతనికి మరింతగా పేరు తెచ్చింది. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రాజ్ కందుకూరి కుమారుడిగా మంచి నేపథ్యం ఉన్నా నటుడిగా తానేంటో నిరూపించుకోవాలనేదే తన కోరికని చెప్పాడు శివ కందుకూరి. శుక్రవారం అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా శివ కందుకూరి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

నా విధానం కరెక్ట్…
నేను చేసే సినిమా కథలో నా పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూస్తాను. ‘గమనం’ అలా చేసిందే. ఈ సినిమా ఓటీటీలో విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. దాన్ని బట్టి నేను ఎంచుకున్న విధానం కరెక్ట్ అనిపించింది.

స్టోరీ రియలిస్టిక్‌గా…
కనీసం నా కెరీర్ తొలి దశలో అయినా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేసినా ఆర్గానిక్ సినిమాలే చేస్తాను. నేను చేస్తున్న ‘మను చరిత్ర’ ఆర్గానిక్‌గా ఉంటుంది. క్యారెక్టర్ జర్నీ, స్టోరీ రియలిస్టిక్‌గా ఉంటుంది.

ట్రెండ్ మారింది…
ఏదో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదాని ఏది పడితే అది చేయకూడదు. ప్రేక్షకులు మనల్ని నిశితంగా గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వచ్చాక పలు దేశాల సినిమాలు చూస్తున్నారు. అందుకే నటుడిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

విభిన్నంగా చేయాలని…
ప్రస్తుతం ఇండస్ట్రీలో యూత్ హీరోల మధ్య భారీ పోటీ ఉంది. అది పాజిటివ్ కోణంలోనే ఉంది. ప్రతి ఒక్కరూ కథాపరంగా విభిన్నంగా ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు.

నెక్ట్ ప్రాజెక్ట్…
‘మను చరిత్ర’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఒక క్రైమ్ థ్రి ల్లర్ కూడా చేస్తున్నాను. నూతన దర్శకుడు పురుషోత్తం ఈ చి త్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నాని నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ వెబ్ ఫిలిం, మరో వెబ్ సిరీస్ కూడా చర్చల్లో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News