Sunday, September 15, 2024

గంజాయి మత్తులో సిఐ కుమారుడు వీరంగం

- Advertisement -
- Advertisement -

వరంగల్: గంజాయి మత్తులో సిద్దిపేట ఎఆర్ సిఐ కొడుకు వీరంగం సృష్టించారు. వరంగల్ లోని కాజీపేట చౌరస్తాలో రోడ్డు మీద  ఎఆర్ సిఐ పూర్ణ చందర్ కొడుకు హర్ష టాయిలెట్ పోశాడు. రోడ్డు మీద టాయిలెట్ పోయవద్దని కారు డ్రైవర్ చెప్పడంతో అతడిపై తన స్నేహితులతో కలిసి దాడి చేశారు. కారు డ్రైవర్ పై గంజాయి మత్తులో విచక్షణ రహితంగా హర్ష, అతని స్నేహితులు దాడి చేశారు. హర్షతో పాటు స్నేహితులు కూడా గంజాయి తీసుకున్నట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News