Saturday, September 21, 2024

14 ఏళ్ల చిన్నారిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని పిడియాట్రిక్ బృందం, ప్రాణాంతక సమస్యలతో కూడిన అరుదైన పరిస్థితి అయిన మస్తీనియా గ్రావిస్‌తో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికకు విజయవంతంగా చికిత్స చేసింది. ఆక్సిజన్ స్థాయిలు అతి తక్కువగా ఉండటంతో రోగిని అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. గత రెండు సంవత్సరాలుగా, ఆమె ఆహారం తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటుంది, ఆమె కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటుంది. ఎవరి సహాయం లేకుండా నడవలేకపోయేది. పలువురు వైద్యులు, ఆసుపత్రుల నుండి చికిత్స పొందినప్పటికీ, ఆమె పరిస్థితి మాత్రం క్షీణించింది. హాస్పిటల్ లో చేరే నాటికి ఆమె 32 కిలోల బరువు మాత్రమే ఉంది.

సీనియర్ పిడియాట్రిషియన్ & నియోనాటాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆమెకు పరీక్షలు చేసిన తర్వాత, గొంతు కండరాల పక్షవాతం, నాలుక, ముఖ కండరాలు, చేతులు, కాళ్ల బలహీనత ఉన్నట్లు నిర్ధారించారు. రోగికి కొన్ని రోజుల పాటు వెంటిలేషన్ అవసరం కావటంతో పాటుగా ఆస్పిరేషన్ న్యుమోనియా కోసం చికిత్స చేయబడింది. ఆమెకు మస్తీనియా గ్రేవిస్ (MG) ఉన్నట్లు నిర్ధారణ అయింది, దీనితో పాటుగా ప్రాణాంతక పరిస్థితి అయిన మస్తెనిక్ క్రైసిస్ కూడా ఉన్నట్లు తేలింది. మస్తీనియా గ్రేవిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దీనికి జీవితకాల చికిత్స అవసరం, ప్రతి మిలియన్ పిల్లలలో 1-3 మందిలో మాత్రమే కనిపిస్తుంది. పిడియాట్రిక్ బృందం ఈ క్లిష్టమైన పరిస్థితికి సకాలంలో, సమర్థవంతమైన చికిత్సను అందించింది, న్యూరాలజిస్ట్, డాక్టర్ అపర్ణ, ఆమె పరిస్థితి మెరుగు పడటం లో తన వంతు పాత్రను నిర్వహించారు .

డాక్టర్ కిరణ్ కుమార్ ఈ కేసును గురించి వెల్లడిస్తూ.. “పరిస్థితి తీవ్రత, సంక్లిష్టత కారణంగా ఈ కేసు ప్రత్యేకించి మాకు సవాలుగా నిలిచింది. సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడానికి మా బృందం శ్రద్ధగా పనిచేసింది. రోగి వేగంగా కోలుకోవడం పట్ల మేము సంతోషంగా వున్నాము. అరుదైన, ప్రాణాంతక పరిస్థితులను నిర్వహించడం, సకాలంలో రోగ నిర్ధారణ, జోక్యం ప్రాముఖ్యతను ఈ కేసు నొక్కి చెబుతుంది” అని అన్నారు.

సిటిఎస్ఐ – దక్షిణాసియా సీఈఓ అయిన హరీష్ త్రివేది మాట్లాడుతూ.. “ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో మా నిబద్ధతను, అరుదైన పరిస్థితులకు చికిత్స చేయడంలో ప్రత్యేక సంరక్షణ ప్రాముఖ్యతను ఈ కేసు హైలైట్ చేస్తుంది. అద్భుతమైన రీతిలో ఈ చిన్నారి కోలుకోవడం మా నైపుణ్యానికి, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మా వైద్య బృందం అంకితభావంకు నిదర్శనం” అని అన్నారు.

సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ విజయవంతమైన చికిత్స గురించి మాట్లాడుతూ “ఈ అరుదైన, ప్రాణాంతక పరిస్థితిని విజయవంతంగా నిర్వహించడం మా పిడియాట్రిక్ బృందం అసాధారణ సామర్థ్యాలను నొక్కి చెబుతుంది. మా ఆసుపత్రిలో మా అంకితమైన వైద్య నిపుణులు అందించిన ఉన్నత ప్రమాణాల సంరక్షణకు మేము గర్విస్తున్నాము” అని అన్నారు.

ఎంజి చికిత్సను ప్రారంభించిన తర్వాత, రోగి చెప్పుకోదగిన మెరుగుదలని చూపించింది. వెంటిలేటర్ ను విజయవంతంగా తొలగించారు. ఆమె కండరాల బలహీనత, పక్షవాత సమస్య పరిష్కరించబడింది. ఆమె ద్రవ ఆహారం తీసుకోవడం నుండి ఘన ఆహారం స్వీకరించటం ప్రారంభించింది. ఆమె నడక సామర్థ్యాన్ని తిరిగి పొందింది. పోషకాహార మద్దతుతో డిశ్చార్జ్ చేయబడింది. ఫాలో-అప్‌లో, ఆమె సాధారణంగా తినడం, త్రాగడం చేయటం తో పాటుగా, ఎటువంటి సహాయం లేకుండా స్వతంత్రంగా నడుస్తున్నట్లు మరియు బరువు పెరిగినట్లు కనుగొనబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News