Wednesday, May 1, 2024

24×7…365 రోజులు లాయర్ సాధకబాధకాలపై సిజెఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : న్యాయవాద వృత్తి అనుకున్నంత తేలిక కాదని, కుటుంబ సమయానికి దూరం కావల్సి ఉంటుందని ఇది తన స్వీయఅనుభవంతో చెపుతున్నానని ప్రధాన న్యాయమూర్తి డివే చంద్రచూడ్ తెలిపారు. బెంగళూరులోని జాతీయ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ(ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు) 31వ స్నాతకోత్సవం నేపథ్యంలో విద్యార్థులను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన తొలిసారిగా తన దివంగత భార్య గురించి ప్రస్తావించారు. ఆమె లాయర్‌గా ఉండేదని, ఓ సారి లాఫర్మ్‌కు వెళ్లి లాయర్‌గా పనిచేస్తానని, పనివేళలు ఏమిటని అడగగా వారు రాత్రింబవళ్లు, సంవత్సరం అంతా అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. కాగా కుటుంబం ఉన్న వారి సమస్య ఏమిటని ఆమె అడిగితే వారు ఇంటిపనిచేసుకుంటూ ఉండే భర్తను వెతుక్కుంటే మంచిదని,

లాయర్లకు అయితే కుటుంబ సమయం ఉండదని చెప్పారని అన్నారు. ఇది అప్పటి విషయం అని, ఇప్పుడు మార్పు కనబడుతోంది. పనిచేసే చోటును మరింత సానుకూలం చేసుకోవాలని, ప్రత్యేకించి మహిళల పట్ల స్నేహభావంతో ఉండాలని సూచించారు. మహిళా లాయర్లు, కోర్టుల్లో పనిచేసే మహిళలకు పలు ఇతరత్రా సమస్యలు ఉంటాయని చంద్రచూడ్ సానుభూతి వ్యక్తం చేశారు. మహిళలు రుతుస్రావం సమస్యలు ఎదుర్కొంటారని ఈ దశలో వారికి తాను ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించినట్లు చంద్రచూడ్ తెలిపారు. అందరి అంతర్గత సాధకబాధకాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇందుకు ముందు వారితో మాటలు పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే న్యాయవృత్తిలో మనకు అవసరం అయిన న్యాయం దక్కుతుందని తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News