Tuesday, October 15, 2024

శ్రీవారిని సందర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఆదివారం తిరుమలలోని శ్రీవారిని సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టిటిడి కార్యనిర్వాహక అధికారి జె. శ్యామల రావు, అదనపు కార్యనిర్వాహక అధికారి వెంకయ్య చౌదరి ప్రోటోకాల్ డిగ్నిటరీ అయిన చంద్రచూడ్ కు ఘనంగా ఆహ్వానం పలికారు.

ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గుడిలోకి ప్రవేశించి, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు, ఆయన కుటుంబానికి  వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత టిటిడి ఈవో చంద్రచూడ్ కు లామినేషన్ చేసిన శ్రీవారి ఫోటో, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Chandrachud2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News