Sunday, September 14, 2025

నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ : పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేపు (సోమవారం) కేబినేట్ చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలుత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body elections) కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని తెలియజేశారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వారం రోజుల్లోనే రైతు భరోసా సన్నాలకు బోనస్ ఖాతాల్లో జమ చేస్తామని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని పొంగులేటి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News