Thursday, February 2, 2023

రైస్ మిల్లర్లకు వరం

- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రైసు మిల్లర్లకు సిఎం కెసిఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా వారు నిరీక్షిస్తున్న రెండు శాతం సిఎస్‌టి పన్ను బకాయిని పూర్తిగా రద్దు చేశారు. ఇదే అంశంపై రైసు మిల్లర్లు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన కెసిఆర్‌ను మరోసారి సిఎస్‌టి పన్ను బకాయిని రద్దు చేయమని కోరారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో (01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో) 2 శాతం సిఎస్‌టి పన్ను బకాయిని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తున్న సిఎం కెసిఆర్ వెల్లడించారు.

ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని పేర్కొన్నారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చడం ద్వారా ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతామని సిఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా బకాయిపడిన సిఎస్‌టిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి రాష్ట్ర రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని సిఎం పునరుద్ఘాటించారు.తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సి.. ఫారం దాఖలు చేస్తే (సిఎస్‌టి) పన్నులో 2 శాతం రాయితీని కల్పించే విధానం ఉండేదన్నారు.

ఈ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలయ్యిందన్నారు. అనంతరం రాష్ట్రంలో కూడా ప్రారంభంలో అమలయ్యిందని పేర్కొన్నారు. అయితే 01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సి-ఫారం సబ్‌మిట్ చేయలేదనే కారణం చేత బియ్యం ఎగుమతి దారులకు సిఎస్‌టిలో 2 శాతం పన్ను రాయితీ కల్పించడం నిలిపివేయడం జరిగిందన్నారు. కేవలం సి…ఫారం సబ్‌మిట్ చేయలేదనే పేరుతో రాష్ట్ర రైస్ మిల్లర్లకు 2 శాతం పన్ను రాయితీని అవకాశాన్ని కల్పించకపోవడం వలన తాము ఆర్థికంగా నష్ట పోతున్నామని గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు అభ్యర్థిస్తూ వచ్చారన్నారు. బియ్యం ఎగుమతి చేశామా? లేదా? అనేది నిర్దారణ చేసుకోవడమే సి ఫారం ఉద్దేశమన్నారు. అది లేనంత మాత్రాన తమ హక్కును ఎట్లా రద్దు చేస్తారని వారు పలుమార్లు ప్రభుత్వంతో వారు మొరపెట్టుకున్నారు. సి ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్దారణ చేసుకోవడానికి ఇతర పద్దతులను పరిశీలించాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారని కెసిఆర్ వెల్లడించారు. తాము చేసిన లోడింగ్, రిలీజింగ్, సర్టిఫికేట్లు,లారీలు రైల్వే పర్మిట్లు , వే బిల్లులు తదితర ఏ ప్రూఫ్ నైనా తాము సబ్‌మిట్ చేస్తామని, వాటిని పరిగణలోకి తీసుకుని రెండేండ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్నును రద్దు చేయాలని కోరడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కెసిఆర్ వెల్లడించారు.

మరోసారి సిఎంకు విజ్ఞప్తి చేసిన రైస్ మిల్లర్లు
దామరచర్ల పర్యటన సందర్భంగా మిర్యాలగూడెం ఎంఎల్‌ఎ భాస్కర్ రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కూడిన తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోషియేషన్ ప్రతినిధులు సిఎం కెసిఆర్‌ను కలిసి విజ్జప్తి చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించుకున్నారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సిఎం… ఇందులో కేవలం రైస్ మిల్లర్ల ప్రయోజనమే కాకుండా రాష్ట్ర రైతాంగ ప్రయోజనం కూడా ఇమిడి ఉన్నదనే విషయాన్ని గ్రహించారు. రాష్ట్రం అద్భుతంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో బియ్యం ఎగుమతులను ప్రోత్సహించిడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యంగా భావించారు. తద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు చేసినట్లవుతుందని సిఎం నిర్ణయించుకున్నారు. తెలంగాణ రైస్ మిల్లర్ల అభ్యర్థనను పరిశీలించి, ఎటువంటి సాయం చేయవచ్చునో ఆలోచించాలని, తక్షణమే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.

అటు రైస్ మిల్లర్లకు ఇటు రాష్ట్ర రైతులకు ప్రయోజనం కలిగే విధంగా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షున్ని సిఎం ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు క్షున్నంగా పరిశీలించిన మీదట రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసిన సందర్భంలో సి ఫారం బదులు అందుకు సామానమైనచ లోడింగ్ సందర్భంగా ఇచ్చే సర్టిపికేట్లు కానీ ., బియ్యం అన్ లోడ్ చేస్తున్న సందర్భంగా ఉండే కాగితాలు, వే బిల్లులు, లారీలు రైల్వే ల ద్వారా చేసే రవాణా పర్మిట్లకు సంబంధించిన కాయితాలు., తదితర సంబంధిత పర్మిట్ సర్టిఫికేట్లు ఏవి ఉన్నా వాటిని సబ్‌మిట్ చేసి తాము ఎగుమతి చేసినట్టు నిర్థారించుకుంటే వాటిని సి ఫారం ప్లేస్‌లో పరిగణలోకి తీసుకోవచ్చునని అన్నారు. ఈ నేపథ్యంలో 01.04.2015 నుంచి 30.06.2017 కాలానికి నడుమ రాయితీ ఇవ్వకుండా నిలిపివేసిన 2 శాతం పన్నును రద్దు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. సిఎం కెసిఆర్‌ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే జారీ చేసింది.

కెసిఆర్‌కు కృతజ్ఞతలు
తమ అభ్యర్థనను మన్నించి తక్షణమే జీవో జారీ చేసినందుకు తెలంగాణ రైస్ మిల్లర్లు, రైతాంగం తరఫున ఎంఎల్‌ఎ భాస్కర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు సిఎంను ప్రగతి భవన్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

CM KCR good news for rice millers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles