Monday, April 29, 2024

సిఎం కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయం

- Advertisement -
- Advertisement -
  • కాంగ్రెస్, బిజెపిలు మునిగి పోయే నావా
  • బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్, బిజెపి నేతలు
  • రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

కొండాపూర్: రాష్ట్రంలో మళ్లీ వచ్చే బిఆర్‌ఎస్ ప్రభుత్వమని, కాంగ్రెస్, బిజెపిల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో అనంతసాగర్ సర్పంచ్ అంకుశ, కాంగ్రెస్ కొండాపూర్ మండల అధ్యక్షుడు ఇంద్రారెడ్డి, మాజీ ఎంపిటిసి ప్రకాశంలు, జాకీర్, బిజెపి నాయకుడు మాజీ ఎంపిపి యాదయ్య, మాజీ ఎంపిటిసి రమణి నరేష్, మల్లారెడ్డిలకు హైద్రాబాద్‌లోని ఆయన నివాసంలో మంత్రి హరీష్‌రావు పార్టీ కండువా వేసి బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ పాలనను చూసి కాంగ్రెస్, బిజెపి నాయకులు బిఆర్‌ఎస్‌లోకి వస్తున్నారన్నారు. దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ సంక్షేమ పథకాలు నిలుస్తున్నాయన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి అందుబాటులో ఉండరన్నారు. ప్రజలకు చేసిందేమి లేదన్నారు. చింత ప్రభాకర్ ప్రజల కోసం సంగారెడ్డి అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా లేకపోయిన నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేరిన నేతలు మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో చింత ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేస్తామని, భారీ మెజార్టీతో చింత ప్రభాకర్‌ను గెలిపించుకు వస్తామన్నారు.

సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు చింత ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, కంది ఎంపిపి సరళ పుల్లారెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పాండురంగం, రామచంద్రయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి, సర్పంచ్‌లు రుక్మోద్దీన్, ఫహీం, లకా్ష్మరెడ్డి, అరవింద్‌రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News