Friday, April 19, 2024

గాంధీలో బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

CM KCR Inaugurates Gandhi Statue at Gandhi Hospital

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 16 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… ద్యానమూర్తిలో ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించడం గొప్ప విషయమన్నారు. విగ్రహ ఏర్పాటుతో మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు చిరస్థాయి కీర్తి దక్కుతుందన్నారు. కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి సేవలు ప్రశంసనీయమని సిఎం కొనియాడారు. గాంధీ వైద్య సిబ్బంది ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారు.  మిగతా ఆస్పత్రుల్లో తిరస్కరించినా ఇక్కడికి తెచ్చి రోగుల ప్రాణాలు కాపాడారని హర్షం వ్యక్తం చేశారు. గాంధీ స్ఫూర్తితో పనిచేసిన సిబ్బందికి సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ వాణీదేవి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News