Wednesday, August 20, 2025

ఎందుకు రాలేదో తెలియదు: గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

CM KCR not attend to Governor's 'AT Home'

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి సిఎం గైర్హాజరుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. సిఎం కెసిఆర్ సోమవారం సాయంత్రం 6.50కి వస్తారని సిఎంవో నుంచి సమాచారం వచ్చింది. తాను, హైకోర్టు సీజే సిఎం కెసిఆర్ కోసం ఎదురుచూసినట్లు గవర్నర్ తెలిపారు. అయితే కెసిఆర్ ఎందుకు రాలేదో తెలియదన్నారు. బాసర ట్రిపుల్ ఐటి సమస్యలపై కెసిఆర్‌కు లేఖ రాశానని తమిళిసై తెలిపారు. విద్యార్థులకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలనేది తన ఉద్దేశ్యమని వివరించారు. కాగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై తేనీటి విందు ఇచ్చారు. ఈ వేడుకకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరయ్యారు. పలు పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎట్ హోం కార్యక్రమానికి కెసిఆర్ వెళతారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆయన వెళ్లలేదు. మంత్రులు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా కనిపించలేదు.

CM KCR not attend to Governor’s ‘AT Home’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News