Saturday, April 20, 2024

సూర్యుడులో తీవ్ర కలకలం?

- Advertisement -
- Advertisement -

A state of extreme crisis in the solar sphere

విస్పోటనలు…వలయంలో తుపాన్లు
నడివయస్సు దశలో పెను మార్పులు
ఇక ముందుపై ఇయూ స్పేస్‌క్రాఫ్ట్ శోధన

న్యూయార్క్ : విశ్వజీవకాంతికి కారకమైన సూర్యగోళంలో తీవ్రస్థాయి సంక్షోభ స్థితి నెలకొందని ఖగోళ శాస్త్రజ్ఞుల అధ్యయనంలో వెల్లడైంది. సూర్యుడు ఇప్పుడు మధ్యస్థ జీవిత దశ గందరగోళంలోకి జారుకుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకూ సూర్యుడి ఆవిర్భావం , ఈ గ్రహంలోని అత్యంత కీలక పరిణామాలు , జీవహరిత కారకాలు అందించే అపార కాంతి వంటి అంశాలపై శాస్త్రజ్ఞులకు ఎటువంటి కీలక సమాచారం లేదు. అయితే ఇప్పుడు సంభవించిన సూర్యగోళ సంక్షోభ పరిణామంతో ఇది క్షీణించే దశ ఎప్పుడు? అనేది తెలుసుకునే వీలుంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. ఇటీవలి కాలంలో సూర్యుడిలో తరచూ సౌర అగ్ని వలయాలు విస్ఫోటనానికి దారితీయడం,సూర్యుడి చుట్టూ ఉండే వలయం దాటి అగ్ని విరజిమ్మడం వంటి పరిణామాలను గమనించారు. ఇవి ఎంతమేరకు ప్రమాదకరం అనే విషయంపై పరిశోధనలు ముమ్మరం చేశారు. గయియా అంతరిక్ష నౌక ఇటీవల సూర్యుడిలోని ఇప్పటి ఇంతకు ముందటి ఇక ముందటి స్థితిని విదితం చేస్తూ వచ్చింది. సూర్య వలయం నుంచి హైడ్రోజన్ వెలుపలికి రావడం, ఈ దశలో ఈ హైడ్రోజన్ అతి పెద్ద ఎర్రటి నక్షత్రంగా రూపుదిద్దుకోవడం వంటి పరిణామాలను గుర్తిచారు. సౌరవ్యవస్థలో ఇప్పుడు పెనుతుపాన్లు ఏర్పడుతున్నాయి.

ఈ క్రమంలో సూర్యుడు ఇప్పుడు మధ్య వయస్సు దశకు చేరుకుంటున్నట్లు భావిస్తున్నారు. సూర్యుడి ఇప్పటి వయస్సును 4.57 బిలియన్ సంవత్సరాలుగా విశ్లేషించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరఫున గయియా అంతరిక్ష నౌక ఖగోళంలోని పాలపుంతలు, ప్రత్యేకించి సూర్యుడి అంతర్గత పరిణామాలను పరిశోధిస్తోంది. గాఢ సాంద్రతతో కూడిన ఛాయాచిత్రాలను పంపిస్తోంది.ఈ క్రమంలో సూర్యుడిలోని సంక్షోభ విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యుడిలోని తాజాపరిణామాల దశలోనే ఏర్పడుతున్న భారీ ద్రవ్యరాశితో కూడిన పలు నక్షత్రాలు సూర్యుడి స్థాయిలో పెద్దవిగా ఉంటున్నాయి. ఇవి భవిష్యత్తులో ఏ విధంగా రూపాంతరం చెందుతాయనేది తేల్చాల్సి ఉంది. కోట్లాది సంవత్సరాల వయస్సుకు చేరిన సూర్యుడు హైడ్రోజన్‌ను వెదజల్లుతూ , ఇది హీలియంగా రూపాంతరం చెందుతూ వస్తోంది. ఈ క్రమంలో సూర్యుడి పరిణామాలు స్థిరంగానే ఉన్నాయని, అయితే తరువాతి పరిణామాలు ఏమిటనేది స్పష్టం కాలేదు. సూర్యుడిలో గత వారం పలు పేల్లుళ్లు చోటుచేసుకున్నాయి. సూర్యుడి వలయంలోని హైడ్రోజన్ అంతరించి పోతే తరువాతి దశలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి.

8 బిలియన్ సంవత్సరాల వయస్సుకు వస్తే డేంజర్

సూర్యుడి వయస్సు 8 బిలియన్ సంవత్సరాల దశకు చేరితే గరిష్ట ఉష్ణోగత స్థాయికి చేరుకుంటుంది. దీని పరిణామాలు మరింత తీవ్రతరం అవుతాయని ఖగోళశాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. ఈ దశ తరువాత చల్లబడుతుంది. ఈ రెండు పరిణామాలు విపరీత ఫలితాలతోనే ఉంటాయి. ఎర్రటి పూర్తిస్థాయి నక్షత్ర దశకు చేరుకుంటుంది. ఇక సూర్యుడు రమారమి 1011 బిలియన్ సంవత్సరాల దశకు చేరుకుంటే అది సూర్యుడి దశ అంతపు కాలం అవుతుందని అధునాతన ఖగోళ పరిశోధనల క్రమంలో స్పష్టం అయింది. సూర్యుడిలోని పరిణామాలను సెంటిమెంట్లకు అతీతంగా గుర్తించాల్సి ఉంది. సూర్యుడి సృష్టి, తరువాతి పరిణామాలు ఉనికికి అత్యంత కీలకమైనది కాబట్టి అంతర్గత విషయాలను గుర్తించాల్సి ఉంటుంది. సూర్యుడి పరిణామాలను పూర్తిగా తెలుసుకుంటే కానీ ఇతర స్టార్స్ పూర్వాపరాలు , భావి పరిస్థితిని, బ్రహ్మండమైన అత్యద్భుతమైన గెలాక్సీ గురించి తెలుసుకోవడం కష్టం అవుతుందని ఇయూ అంతరిక్ష కేంద్రానికి చెందిన పర్యవేక్షకులు ఒర్లాగ్ క్రీవె తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News