Wednesday, February 21, 2024

దీక్షా దివస్ స్ఫూర్తితో..

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే రణ నినాదంతో స్వరాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29 నాడు తెలంగాణ జైత్ర యాత్ర నా శవయాత్రన అనే అంతిమ పిలుపుతో నాటి ఉద్యమ రథ సారథి కెసిఆర్ దీక్షబూనిన మహోన్నత లక్ష్యాన్ని మనం ఇప్పుడు స్మరించుకోవాల్సి వున్నది. సమరానికి సై అని ఉరుకు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడుపు అంటూ కెసిఆర్ ఇచ్చిన పిలుపుతో ఊర్లకు, ఊర్లకు ఏకమయ్యాయి. తెలంగాణ అష్ట దిగ్భంధమైంది. తెలంగాణ బిడ్డల పోరాట పటిమకు ఢిల్లీ పెద్దలు తలవంచక తప్పలేదు. డిసెంబరు 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటన చేసింది. కేంద్రం నుంచి ప్రకటన వచ్చిన తర్వాతనే కెసిఆర్ తన 11 రోజుల దీక్షను విరమించారు. తర్వాత సమైక్యవాదులు కృత్రిమ ఉద్యమంతో కుట్రలు చేసినా.. అవేవి కెసిఆర్ పట్టుదల పోరాటం, దీక్షాదక్షత ముందు నిలబడలేకపోయాయి. చావునోట్లో తలపెట్టి, ప్రాణాలకు తెగించి కెసిఆర్ చేసిన పోరాటం చివరకు అంతిమ లక్ష్యాన్ని ముద్దాడి తెలంగాణ ప్రజల 60 ఏండ్ల స్వరాష్ట్ర కాంక్ష సాకారం చేసింది.

ఇప్పుడు కూడా తెలంగాణ సమాజం దీక్షా దివస్ స్ఫూర్తితో మరోసారి దీక్షాదక్షులుగా మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం వుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కలలు నిజమయ్యే సమయంలో మనం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సిన సమయం ఇదీ. తెలంగాణను మరొకసారి ఆగం చేయబోతున్న ఢిల్లీ పార్టీలు మల్ల తెలంగాణలో ఎన్నికల పేరుతో దండయాత్ర చేస్తున్న ఈ కీలక సమయంలో యావత్ తెలంగాణ సమాజం నాటి కెసిఆర్ బాధ్యతను నేడు తమ భుజాల మీదికి ఎత్తుకోవలసి ఉన్నది. ఇప్పుడు మరొకసారి దీక్ష పట్టవలసిన చారిత్రక సందర్భంలో మనందరం వున్నాం. నాడు తెలంగాణ కోసం ఉద్యమ రథసారథి తన ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు కానీ నేడు.. మనం చేయవలసిన త్యాగం ఏమిటంటే… చిన్నచిన్న మనస్పర్దలు, భావోద్వేగాలు, అపార్ధాలు, అసంతృప్తులు, స్వీయ మానసిక ధోరణులు వదులుకొని, గులుగుడు, అలుగుడు దూరం పెట్టి రేపటి మన పిల్లల భవిష్యత్తు పట్ల అప్రమత్తంగా ఉండాలి. దార్శనికతతో క్షమాగుణం కలిగి అర్థం చేసుకునే తత్వంతో ముందుకు సాగాలి. ఆ క్రమంలో అరవై యేండ్ల గతాన్ని తలుచుకొని తెలంగాణను మల్లి ఒకసారి గెలిపించుకోవాలి.

60 ఏళ్ల నుంచి కొనసాగుతున్న బిడ్డల ప్రాణత్యాగాలు ఆ తర్వాత తెలంగాణ తేవడానికి కెసిఆర్ చేస్తున్న త్యాగాలు స్వరాష్ట్రంలో తెలంగాణను నిలబెట్టడానికి తాను పడుతున్న బాధలు.. మట్టి అంటకుండా ప్రగతి ప్రస్థానంలో మనలను ముందుకు నడిపిస్తున్న మొత్తం పరిణామ క్రమాన్ని శాంతమైన హృదయంతో తెలంగాణ అర్థం చేసుకుంటే చాలు.తద్వారా తెలంగాణను మల్లా గెలిపించుకొని మన జీవితంలో ఎదురైన కీలక మలుపును దాటాల్సి ఉన్నదిముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దార్శనీకతతో పదేండ్ల ప్రస్థానంలోనే దేశమే మన తెలంగాణవైపు తిరిగిచూసేలా జరిగిన అబివృద్ధి… ముందుకు సాగాలంటే…ప్రజాసామ్య వ్యవస్థలో ప్రగతి కోసం పోరాటంలో ప్రాణాలు పొగొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయుధాలు పట్టి యుద్ధం చేయాల్సిన పనిలేదు, రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన ఓటు అనే ఆయుధాన్ని తెలంగాణను గెలిపించుకోవడానికి వినియోగిస్తే చాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News