Friday, April 26, 2024

2024లో బిజెపి ఖతం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

2024లో భారతీయ జనతా పార్టీ(బిజెపి) కుప్పకూలిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం రాష్ట్ర అసెంబ్లీలో సిఎం కెసిఆర్, బిజెపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ”కాంగ్రెస్, బిజెపి దేశాన్ని ముంచాయి. కాంగ్రెస్ ది  లైసెన్స్ రాజ్, మోడీది సైలెన్స్ రాజ్. మోడీ తెచ్చిన ఏ పాలసీ సక్సెస్ అయ్యింది?. నోట్ల రద్దు సక్సెస్ అయ్యిందా?. పెద్ద నోట్ల రద్దుకు ముందు నాకు ఎన్నో చెప్పారు, నేను నమ్మాను. కానీ.. నోట్ల రద్దు తర్వాత మనీ సర్క్యులేషన్ పెరిగింది.

మేకిన్ ఇండియా.. జోకిన్ ఇండియా అయ్యింది. నేను చెప్పేది ఒక్కటి అబద్దమైనా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. నా మాటకు కట్టుబడి ఉంటా. ఎన్ డిఎ అంటే నో డేటా అవైలబుల్. దేశ ఆర్థిక మంత్రి వచ్చి ఓ డీలర్ తో కొట్లాడింది. ఏం సాధించారని మోడీ ఫోటో పెట్టాలి?. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా బిజెపి ఇవ్వలేదు. మరి బిజెపికి ఎందుకు ఓటేయ్యాలి?. మన్మోహన్ హయాంలో 14 శాతం అప్పులు తగ్గించారు. కానీ, మోడీ హయాంలో 54 శాతం అప్పులు పెరిగాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూపాయి పతనమైంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News