Thursday, May 2, 2024

కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి…కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ భవనాలు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ పా ర్టీ బహిరంగ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడు తూ తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళఖాతం లో వేస్తామని చెప్పడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో మం డిపడ్డారు. ధరణి వల్ల రైతుకు మేలు జరిగిందన్నారు. విఆర్‌ఓ నుండి సిఎం వరకు ఎవరు కూడా ఒక సెంటు భూ మిని కూడా మార్చడానికి వీలు లేకుండా ధరణి పోర్టల్ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.

ధరణి పోర్టల్ వల్ల రైతు బొటనవేలు పెడితే తప్ప భూమి మారదన్నారు. ఆ అధికారమంతా రైతుకే ఇచ్చిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. లంచగొండితనాన్ని రూపుమాపడం జరిగిందని, ధరణిని రద్దు చేస్తే లంచావతారులు మళ్లీ పుట్టుకొస్తారని కెసిఆర్ అన్నారు. ధరణి వల్ల గెట్ల పంచాయతీలు, పోలీస్‌స్టేషన్లలో పంచాయతీ లు, కోర్టుల చుట్టూ తిరిగే పనులు తప్పాయన్నారు. ధరణిని రద్దు చేసి మళ్లీ పంచాయతి పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ఆలోచిస్తుందన్నారు. ధరణి వల్ల లా భం జరిగిందా, నష్టం జరిగిందా అన్న విషయాన్ని ప్రతి రైతు గ్రామాగ్రామాన రచ్చకట్టల వద్ద చర్చ పెట్టాలని సూ చించారు. ధరణి కావాలా వద్దా అని చేతులు ఎత్తాలని సభికులను కోరగా రైతులు, ప్రజలు కేరింతలు వేస్తూ తమకు ధరణి పోర్టల్ ఉండాలని రెండు చేతులు ఎత్తి తమ అభిమతాన్ని చాటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ దళారీలదే రాజ్యం అవుతుందని, దోపిడికి, పంచాయతీలకు దారులు పడతాయన్నారు. రైతన్నలు ఆలోచించుకోవాలని, చేతులెత్తి ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
తలసరి ఆదాయంలో మేమే నెం. 1
తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో నెం.1గా నిలిచిందన్నారు. ఇవి తాము చెబుతున్న గణాంకాలు కావని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పిన లెక్కలన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అనేక అవార్డులు, రివార్డులు పొందుతూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలోనే ఐటి రంగం బలంగా ఉందన్నారు. దేశంలో ఉన్న ఐటి సంస్థలలో 15 శాతం ఉద్యోగాలు తెలంగాణలోనే ఐటి రంగంలో దక్కుతున్నాయన్నా రు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క జూనియర్ కళాశాల మంజూరుకు 20 సంవత్సరాలు పట్టిందని, ప్రస్తుతం తెలంగాణలో 1001 జూనియర్ కాలేజీలు ఉన్నాయన్నారు.

ఉచిత విద్యుత్‌లో రైతు బం ధు, రైతు భీమా వంటి పథకాలలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు మరణిస్తే 8 రోజుల్లో భీమా డబ్బు లు ఖాతాలో జమ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా అని కెసిఆర్ ప్రశ్నించారు. మానవీయ కోణంలో మానవీయ పాల న సాగిస్తుందని బిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేతన్నలను ఆదుకున్న చరి త్ర ఒక్క రూపాయి ఇచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి కులం లే దు, జాతి బేదం లేదని అందరు సమానులు అని కెసిఆర్ అన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేతాడంత పొడువుగా ఉన్నాయన్నారు.
చిమ్మ చీకటిలో ఆంధ్ర
తెలంగాణ వస్తే తెలంగాణ చిమ్మ చీకటి మయం అవుతుందని చెప్పిన ఆంధ్రోళ్లు నేడు చిమ్మ చీకటిలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. విద్యుత్ వినియోగంలో, ఉత్పత్తిలో తెలంగా ణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనతతెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
మహబూబ్‌నగర్ నా కీర్తి కిరీటం
మహబూబ్‌నగర్ జిల్లా నాకు కీర్తి కిరీటం లాంటిదని ము ఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పాలమూరు కరువు గోసను కళ్ళారా చూసిన తాను ప్రొఫెసర్ జయశంకర్ గారిని మహబూబ్‌నగర్ ఎంపిగా తాను నిలబడితే ఎలా ఉం టుందని అడిగితే ఉన్న ఫలంగా అక్కడి నుండి ఎంపిగా నిలబడి గెలిస్తేనే తెలంగాణకు పట్టిన గోస తెలుస్తుందని చెప్పిన తడువుగా మరో ఆలోచన లేకుండా ఎంపిగా నిలబడితే ప్రజలు తనను గెలిపించి తెలంగాణను సాధించేలా చేసింది మహబూబ్‌నగర్ ప్రజలు అన్నారు. ఈ సమయంలోనే తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లగలిగానని కెసిఆర్ అన్నారు. బొంబాయి బస్సు లు, గంజి కేంద్రాలు పెట్టిన గత పాలకుల తీరు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు. పాలు పొంగిన పాలమూరులో గంజి కేంద్రాలు ఏమిటని ఆనాడు తాను ప్రశ్నించుకున్నానన్నారు.

నేడు గంజి కేంద్రాలు మాయమై పాలమూరులో పంటలు అమ్మే కేంద్రాలు ఏర్పాటయ్యేలా చేసి ంది బిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. నాకంటే దొడ్డుగా, పొ డువుగా ఎంతోమంది మంత్రులుగా ఈ ప్రాంతం నుంచి వెలగబెట్టారని దత్తత తీసుకుని బిందెడు నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్‌తో పాటు బిజెపి, టిడిపిలు కలి సి తెలంగాణను 60 ఏళ్లు పాలించి పాలమూరును కరువుకు నిలయంగా మార్చారన్నారు. నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి కృష్ణా నీరు అందిస్తున్నామన్నారు. 5 మెడికల్ కాలేజిలు ఉమ్మడి జిల్లాకు వచ్చాయంటే ఇది సాధ్యమవుతుందని ఎవరైనా అనుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్‌కు మర్రి జనార్ధన్ రెడ్డి పట్టుబట్టి మెడికల్ కాలేజిని సాధించుకున్నారన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని చూపించడానికి పాలమూరు అంటేనే అ మెరికా ప్రధాని బిల్‌క్లింటన్ తదితరులను రప్పించి చూ పించిన భయంకరమైన పరిస్థితులు ఇక్కడ ఉండేవన్నా రు.

ఆంధ్రా పాలకులు కాకతీయ రెడ్డి రాజుల హయాం లో నిర్మించిన 70 వేల చెరువులను సమైక్య పాలకులు మాయం చేశారని దుయ్యబట్టారు. మిషన్ కాకతీయ పేరుతో తెలంగాణలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువు తుమ్మ చెట్లకు, క్రికెట్ మైదానంగా ఉండేదని నేడు మిని రిజర్వాయర్‌గా ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకుని ఆ చెరువులో శాంతిదేవుడు బుద్ధులు మెరిసారన్నారు. హెలికాప్టర్‌లో వస్తుంటే దుందుభి వాగుపై కట్టిన చెక్ డ్యాంలతో నీటితో కళకళలాడుతుంటే నా కళ్ళల్లో ఆనందభాష్పాలు వచ్చాయని చెమ్మగిల్లిన కళ్ళతో కెసిఆర్ చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్సి, కవి గోరేటి వెంకన్న కరువు నేల గురించి పాడి న పాటలు గుర్తుకువచ్చాయన్నారు. ఎండిన కాలువలు, చెరువులపై పాడిన పాటలకు ఇప్పటికే ఉన్న వ్యత్యాసా న్ని గోరటి పాట ద్వారా వింటే మనమెంతగా అభివృద్ధి చెందామో తెలుస్తుందన్నారు.

కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. జులై మా సంలో పాలమూరు రంగారెడ్డి ద్వారా నీటిని ఎత్తిపోసి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వేనా రిజర్వాయర్లను నిం పుతామని ధీమా వ్యక్తం చేశారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని 2300 కోట్లతో నిర్మించి అప్పర్ ప్లాట్‌కు సాగునీటిని అందిచబోతున్నామన్నారు. వలసలతో విలవిలలాడిన కరువు జిల్లా నేడు పచ్చటి పంట పొలాలతో తులతూగుతుందన్నారు. ఝార్ఖండ్, యూపి తదితర రాష్ట్రాల నుంచి పాలమూరుకు వరి నాట్లు వేయడానికి వలసలు వస్తున్నారంటే తెలంగాణ సాధించిన ప్రగతి ఏ పాటితో అర్థం చేసుకోవచ్చన్నారు. మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలోని ధరణి, రైతు భీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను కోరుకుంటున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 459 మండలాలు ఉంటే నేడు 612 మండలాలుగా ఏర్పాటు చేసుకున్నామన్నారు.

ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే 76 మండలాలు ఉన్నాయన్నారు.గతంలో 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటే నేడు 87 ఆఫీసులు ఉన్నాయన్నారు. గతంలో రికార్డులను తారుమారు చేసి దస్త్రాలను చెరిపే విధంగా విఆర్‌ఓలు, ఎంఆర్‌ఓలు వ్యవహరించేవారని, నేడు ధరణితో ఆ విధానానికి చెక్ పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తెలంగాణలో ఈ అభివృద్ధి సాధ్యమైందంటే మహబూబ్‌నగర్ ప్రజలు తనను ఎంపిగా గెలిపించి ఆశీర్వదించడం వల్లే సాధ్యమైందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నేను ఏది తలపెట్టిన భగవంతుడు ఆశీర్వదించి గెలిపించాడని పాలమూరు రంగారెడ్డి ద్వారా సాగునీరు ఇచ్చి నా పాలమూరు బంగారు తునక అని మరోమారు నిరూపిస్తామని కెసిఆర్ అన్నారు.

ఈ బహిరంగ సభలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపిలు రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంఎల్‌సిలు గోరేటి వెంకన్న, కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సి.లకా్ష్మరెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్‌మోహన్‌రెడ్డి, అబ్రహం, గిడ్డంగుల సంస్థ చైర్మెన్, గాయకుడు సాయిచంద్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్ ఇంతియాజ్ ఇసాఖ్, బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకానీ శ్రీనివాస్ యాదవ్, జెడ్పి చైర్‌పర్సన్ శాంత కుమారి, డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News