Friday, March 29, 2024

వడగండ్ల బాధిత రైతులను ఆదుకుంటాం : కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR take care of farmers affected by hail

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆకాల వర్షాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నష్టపోయిన బాధిత రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలోని నర్సంపేట, ములుగు, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో వడగండ్లు, ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతుల జాబితాను అందజేయాలని వ్యవసాయశాఖను సిఎం కెసిఆర్ ఆదేశించారు. బాధిత రైతులను ఆదుకుంటామని శాసనసభలో సిఎం వెల్లడించారు. భూదాన భూములు పొందిన రైతుల పేర్లు ధరణిలో నమోదు కావడం లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క కోరగా.. వెంటనే పరిష్కారం చూపాలని సిఎస్‌ను కెసిఆర్ ఆదేశించారు. నదీ జలాల యాజమాన్య కమిటీల పేరిట కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాలు బచావత్ అవార్డుకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలకు వినియోగించుకుంటామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News