Thursday, July 18, 2024

సిఎం కెసిఆర్ గెలుపు కామారెడ్డికి శక్తి

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శాశ్వతంగా అభివృద్ధి చెందుతుంది
అగ్రవర్ణాలతో సహా అన్ని వర్గాల సంక్షేమానికి సిఎం కెసిఆర్ కృషి
రెడ్డి ఐక్యవేదిక నాయకుల సమావేశంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
అగ్రవర్ణ పేదలకు గురుకులాల నిర్ణయం భేష్
ఐక్యవేదిక నాయకుల హర్షం

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుందని, ఆ ప్రాంతం ఊహించలేనంత అభివృద్ధి చెందుతుందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తెలిపారు. కామారెడ్డి ప్రాంతం రూపురేఖలు మారుతాయని, కామారెడ్డి జిల్లానే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న జిల్లాలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి ఐక్యవేదిక నాయకులు హైదరాబాద్‌లో కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. కామారెడ్డిలో సిఎం కెసిఆర్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిఆర్‌ఎస్ పార్టీ గెలుపునకు తోడ్పడుతామని వారు తెలిపారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…. కామారెడ్డిలో సిఎం కెసిఆర్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందని, తమ ప్రాంతం మరింత అభివృద్ధితో దూసుకెళ్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని వివరించారు. ప్రత్యేక అభివృద్ధి నిధులతో కావాల్సినంత అభివృద్ధి చేసుకోవచ్చునని అన్నారు. పరిశ్రమలు, సంస్థలు వస్తాయని, దాంతో కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు. సాగునీటి వనరులు పెరుగుతాయని, రైతులు ఎంతో లాభపడుతారని చెప్పారు.
సిఎం దూరదృష్టి వల్ల అన్ని వర్గాలకు ఆర్థిక వెసులుబాటు
ముఖ్యమంత్రి కెసిఆర్ కామారెడ్డిలో పోటీ చేసి గెలవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సిఎం కెసిఆర్ దూరదృష్టి వల్ల అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు. అగ్రవర్ణాలతో సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. కామారెడ్డిలో భారీ మెజారిటీతో సిఎం కెసిఆర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పారు. అయితే, కామారెడ్డిలోని రాజబహద్దూర్ వెంకట్రామి రెడ్డి ట్రస్టుకు ప్రతిపాదించిన రెండు ఎకరాల భూమిని ఐదు ఎకరాలకు పెంచి కేటాయిస్తామని ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయాన్ని రెడ్డి ఐక్యవేదిక నాయకులు ప్రస్తావించారు. భూ విస్తీర్ణాన్ని పెంచినందుకు సిఎం కెసిఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. భూకేటాయింపు త్వరితగతిన జరిగేలా తాను చొరువ తీసుకుంటానని కవిత సానుకూలంగా స్పందించారు.
అగ్రవర్ణ పేదలకు గరుకులాల ఏర్పాటు పట్ల హర్షం
రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదల కోసం గురుకుల పాఠశాలు ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీ మెనిఫెస్టోలో చేర్చడం పట్ల రెడ్డి ఐక్యవేదిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురుకులాల ఏర్పాటు చాలా మంచి నిర్ణయమని, అగ్రవర్ణ పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని వారు తెలిపారు. అగ్రవర్ణ పేదల పిల్లల చదువు గురించి ఆలోచించి తొలి అడుగు వేసిన నాయకుడు సిఎం కెసిఆరేనని ప్రశంసించారు. రైతుబీమా వల్ల ఎన్నో పేద కుటుంబాలకు ఆపదలో సిఎం కెసిఆర్ ఆసరా అవుతున్నారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీ మెనిఫెస్టోను ఆమోదిస్తున్నారని వివరించారు. కవితతో జరిగిన సమావేశంలో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి, కామారెడ్డిలోని రాజబహద్దూర్ వెంకట్రామి రెడ్డి ట్రస్టు చైర్మన్ నాగర్తి చంద్రా రెడ్డి, వైస్ చైర్మన్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి నాయకులు గంగా రెడ్డి, రమేశ్ రెడ్డి, రాం రెడ్డి, మల్లా రెడ్డి, భీమ్ రెడ్డి, నర్సారెడ్డి, రాజ్ కుమార్ రెడ్డి, ఏలేటి రాంరెడ్డి, వెల్మ మల్లారెడ్డి, నవీన్ రెడ్డి ,నర్సారెడ్డి ,మధుసూదన్ రెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.

Kavitha 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News