Monday, March 17, 2025

మన్నార్ జలసంధిలో ఖనిజాల అన్వేషణను ఆపాలి:సిఎం ఎంకె స్టాలిన్

- Advertisement -
- Advertisement -

మన్నార్ జలసంధిలో ఖనిజాల అన్వేషణకు కేంద్రం జారీ చేసిన వేలం నోటిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మంగళవారం ఒక లేఖ రాశారు. ఆ ప్లాన్ ‘సాగరప్రాంత పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, లక్షలాది మంది మత్సకారుల జీవనోపాధిని దెబ్బ తీస్తుంది’ అని స్టాలిన్ సూచిస్తూ అందులో ఉన్న ఇబ్బందులను ఉటంకించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ఆయన తెలిపారు.

‘ప్రధాని నరేంద్ర మోడీ ! మన్నార్ జలసంధి బయోస్ఫియర్ రిజర్వ్‌లో పెట్రోలియం, సహజ వాయువు అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వేలం నోటిఫికేషన్ వల్ల సాగరప్రాంత పర్యావరణ వ్యవస్థకు, లక్షలాది మంది జాలర్ల జీవనోపాధికి నష్టం వాటిల్లుతుంది’ అని స్టాలిన్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘తీవ్రమైన పర్యావరణ, సాంఘిక ఆర్థిక పర్యవసానాలు ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకునే ముందు తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. ఈ వేలం నోటిఫికేషన్ రద్దుకు మీరు వెంటనే జోక్యం చేసుకుని, సాగర వారసత్వ సంపదను, తీరప్రాంత సమాజాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News