Monday, September 1, 2025

కాళేశ్వరం బాధ్యులపై క్రమినల్ చర్యలు

- Advertisement -
- Advertisement -

జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సిఫారసు

అవసరమైతే సిబిఐ, సిఐడిలతో విచారణ
అప్పటి ఇఎన్‌సి మురళీధర్, చీఫ్ ఇంజినీర్ హరిరాం,
నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి, సిఎం
అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌పై క్రిమినల్ కేసులు
నిబంధనల ఉల్లంఘనలు, నిర్మాణ, నాణ్యత లోపాలు
సుస్పష్టం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణంలో అడుగడుగునా లోపభూయిష్టంగా ఉన్నాయని, దీనిపై రాష్ట్ర ప్ర భుత్వం ఏర్పాటుచేసిన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ కమిషన్ తన నివేదికలో ఎత్తిచూపింది. సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడం, సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్‌లైన్స్ నిబంధనలను పాటించకపోవడం, మంత్రివర్గం ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగినట్లుగా తన 660 పే జీల నివేదికలో పేర్కొంది. ఇందులో ప్రధానంగా కమిషన్ ఎత్తిచూపిన లోపాల్లో డ్యామ్‌లకు బ్యారేజిల మధ్య తారతమ్యం లేకుండా నిర్మాణం జరిగిందని కమిషన్ తప్పుపట్టింది. తన నివేదికలోని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే సిబిఐ లేదా సిబిసిఐడి విచారణ సం స్థలతో విచారణ జరిపించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది.

భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో సమగ్రంగా హైడ్రాలజికల్, జియోటెక్నికల్ పరిశీలనలు తప్పనిసరి చే యాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణాలు జరిగిన చోట జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ పూర్తిస్థాయిలో సమగ్రంగా జరగలేదని పేర్కొంటూ బ్యారేజిల నిర్మాణాల స్థలాల్లో సరైనరీతిలో నమూనాలు తీసుకోలేదని, ఫౌండేషన్ ట్రీట్‌మెంట్ డిజైన్లు పూర్తిస్థాయి డేటా ఆధారంగా లేవని కమిషన్ ఎత్తిచూపింది. బ్యారేజీ నిర్మాణంలో కాంక్రీటింగ్ సమయంలో క్వాలిటీ కంట్రోల్ ప్రమాణాలు పాటించలేదని, గ్రౌటింగ్ పనులు సరిగ్గా చేయకపోవడం వల్లనే మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు, పగుళ్ల కారణమని పేర్కొంది. నిర్మాణ సమయంలో జాయింట్లను స రిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల కాంక్రీట్ పటిష్టం గా లేకుండా పోయిందని వెల్లడించింది.

నిర్మాణ సమయంలో వివిధ దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలు మొక్కుబడిగా తప్ప పూర్తిస్థాయిలో జరగలేదని కమిషన్ పేర్కొంది. మేడిగడ్డ వద్ద బ్యారేజి ని ర్మాణం గురించి వ్యాప్కోస్ సంస్థ ఎలాంటి ప్రస్తావన చేయలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ముం దుగానే మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మించాలని నిర్ణయించింది కానీ, అది వ్యాప్కోస్ నివేదిక ఆధారం గా తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజిలో ఏడో బ్లాక్‌లోని ఆరు పిల్లర్లు కుంగిపోయాయని సంబంధిత ఇంజినీర్ మహాదేవ్‌పూర్ పోలీసు స్టేషన్‌లో నమోదు చేసినట్లు కమిషన్ ప్రస్తావించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో ని ర్లక్షం వంటి లోపాలు ఉన్నట్లు కమిషన్ తేల్చింది.

అంచనాలు, పరిపాలనా అనుమతులు మం జూరు విషయంలో సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లూసి) నుంచి అనుమతులు పొందే విషయంలో సరైన విధానాన్ని అనుసరించలేదని తెలిపింది. ప్ర భుత్వ ఉత్తర్వులు జి.వో నెం.28 ప్రకారంగా ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి అనుకూలమైన చోటు కాదని స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వం దానిని పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణం చేపట్టిందని కమిషన్ తప్పుపట్టింది. అంతే కాకుండా తుమ్మిడి హెట్టి వద్ద నీరు అందుబాటులో ఉండదనే కార ణం సరైంది కా దంటూ సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లూసి) 2015, 2017 సంవత్సరాల్లో ఇచ్చిన లేఖల్లో పే ర్కొన్న వివరాలు ఓకే విధంగా ఉన్నట్లు పేర్కొం ది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యా రేజిలు నిర్మించాలనే నిర్ణయం పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రిదేనని కమిషన్ స్పష్టం చేసింది.

కాంట్రాక్టుల్లో అవలంబించిన విధానం తప్పే
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇచ్చిన పనులను ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కాం ట్రాక్టుల విషయంలో టర్న్ కీ ప్రాతిపదికన ఇ వ్వాల్సి ఉండగా, చట్టవిరుద్ధ్దంగా లప్సమ్ బేసిస్ లో ఇవ్వడాన్ని తప్పుపట్టింది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ ద్వారా వర్క్ టెండర్లు ఆహ్వానించకపోవడాన్ని కూడా కమిషన్ తప్పు పట్టింది. అంతే కాకుండా ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా వ్యవహారాలు జరిగాయని గుర్తించింది. వ్యాప్కోస్ ఇచ్చి న డిటైల్డ్ ప్రాజె క్టు రిపోర్టు(డిపిఆర్)లోని సాంకేతిక అంశాలను పరిశీలించకుండానే అంచనాల ను ఆమోదించార ని, అంచనాలను రెండుసార్లు ఆమోదించాల్సి వ చ్చిందని, రెండోసారి అంచనాల సవరణ సందర్భంలో కాంట్రాక్టు కండిషన్లను సడలించి నిర్మాణ సంస్థలకు లాభాలు కలిగించే విధంగా చేశారని ఘోష్ నివేదికలో పొం దుపరిచింది. ఇలాంటి మా ర్పులన్నీ ఉద్దేశ్యపూర్వకంగా, దురుద్దేశ్యంతో ప్ర జా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు కమిషన్ తే ల్చింది. నిర్మాణ సంస్థలకు సబ్‌స్టాన్షియల్ కంప్లిష న్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ కంప్లిషన్ ఆఫ్ వర్క్ జారీచేయడం చట్టవిరుద్దమని తెలిపింది. నిర్మాణ సం స్థలకు బ్యాంక్ గ్యారెంటీలు విడుదల చేయడం కూడా చట్టవిరుద్ధమని కమిషన్ నిర్ధ్దారించింది. నిర్మాణ సంస్థలు నిర్ణీత కాలంలో పనులు పూర్తిచేయకపోవడానికి పెనాల్టీలు విధించకపోగా, ని బంధనలకు విరుద్దంగా కాంట్రాక్టు కాలాన్ని పొడిగించడాన్ని కమిషన్ తప్పుపట్టింది. మూడు బ్యా రేజీలకు సంబంధించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయని, వీటి ఓ అండ్ ఎం మా న్యవల్ కూడా అందుబాటులో లేదని పేర్కొంది.

ఎన్డీఎస్‌ఎ తేల్చిన కారణాలు ఇవి
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఎ) 2023 అక్టోబర్ 22న మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలు గుర్తించేందుకు ప్రత్యేకంగా క మిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ అక్టోబర్ 24వ తేదీన మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించి నవంబర్ ఒకటో తేదీన ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఎన్డీఎస్‌ఎ కమిటి పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధా న కారణం ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపా లే ప్రధాన కారణమని స్పష్టం చేసిం ది. పునాదులు పూర్తి సా మర్ధంతో లేకపోవడంతో పాటు డ్యామ్ సేఫ్టీ యా క్ట్ 2021 నిబంధనల మేరకు పలు చోట్ల లోపాలు ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది తీవ్రమైన విషయం గా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితిలో రిజర్వాయర్ ను నీటితో నింపడం వల్ల పరిస్థితి మరింత దెబ్బతీస్తుందని, అలాంటి పనులు చేయవద్దని సూచించింది.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ని ర్మాణ లోపాలపై బాధ్యులైన ఆనాటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. మూడు బ్యారేజీలను టర్న్ కీ పద్ధ్దతిలో ఇ వ్వకుండా లప్‌సమ్ కాంట్రాక్టులు తీసుకున్న విషయాన్ని అడ్వయిజరీ కమిటీ సమావేశంలో గోప్యత పాటించిన నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్(ఇఎన్సీ) సి.మురళీధర్, చీఫ్ ఇంజినీర్ బి.హరిరామ్‌లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ నివేదికను బహిర్గతం చేయకుండా మేడిగడ్డ బ్యారేజి నిర్మాణానికి అనుకూల వాతావరణం కల్పించడం లో కీలకపాత్ర పోషించిన ఆనాటి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి, ఇఎన్సీ మురళీధర్, చీఫ్ ఇంజినీర్ హరిరామ్‌లపై చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. మూడు బ్యారేజిల నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచకపోవడం ద్వారా బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించిన నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌లపై చర్యలు తీసుకోవాలని సూచించింది.

స్టడీ చేయని రీసెర్చ్ ల్యాబ్
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్స్(టిఎస్‌ఇఆర్‌ఎల్) ఇంజినీర్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు సంబంధించిన మోడల్ స్టడీస్ సరైన రీతిలో అధ్యయనం చేయలేదని కమిషన్ తేల్చింది. బ్యారేజీల డ్రాయింగ్స్‌ను ఎమర్జెన్సీ పేరుతో పరిశీలించడం బాధ్యతారాహిత్యం గా పేర్కొంది. బ్యారేజీలకు సంబంధించిన రికార్డులు కూడా సమగ్రంగా నిర్వహించలేదని, పూ ర్తి స్థాయిలో పర్యవేక్షించలేదని, క్వాలిటీ కంట్రల్ తనిఖీలు సరిగ్గా చేయలేకపోగా, వాటికి సంబంధించిన రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించలేద ని కమిషన్ వెల్లడించింది. బ్యారేజీలలో నెలకొన్న లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత సదరు నిర్మాణ సంస్థలదేనని ఘోష్ కమిషన్ వెల్లడించింది.

క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు
మూడు బ్యారేజీల నిర్మాణాల్లో అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రజా నిధుల దుర్వినియోగం చే సిన అధికారులందరిపైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ 1988 చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. నిర్లక్షంగా వ్యవహరించిన, ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వారిపై ఐపిసి సెక్షన్ 409 ప్రకారం కేసులు నమోదు చేయాలని, తప్పుడు సాక్షం ఇచ్చిన అధికారులపై ఐపిసి సెక్షన్లు 191, 193 కింద చర్యలకు సిఫార్సు చేసింది.

ఆర్ధిక అంశాలు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో భాగంగా మే డిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణ ఖ ర్చును మొదటి అంచనాలు రూ.80,499 కోట్లు గా నిర్ధారించారు. పనులు ప్రారంభమైన కొద్ది కా లానికే వ్యయాన్ని రూ.94,447 కోట్లకు పెంచారని కమిషన్ నివేదికలో తెలిపింది. రెండోసారి స వరణ అంచనాల వ్యయాన్ని రూ.1,21,611 కోట్లకు పెరిగిందని, ఈ అంచనాల సవరణకు మంత్రివర్గం సమావేశంలో ఆమోదం పొందకుం డా ఆర్ధిక శాఖ నుంచి అనుమతులు ఇచ్చారని, ఇ ది ఆర్ధిక క్రమశిక్షణ ఉల్లంఘన, బిజినెస్ రూల్స్‌కు విరుద్దమని కమిషన్ వెల్లడించింది. ప్రాజెక్టు వ్యయం పెరుగుదలకు వీలైన టెక్నికల్ జస్టిఫికేషన్ ఇవ్వలేదని కమిషన్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News