Tuesday, September 10, 2024

రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. మూడో విడత నిధులు విడుదల చేసిన రేవంత్

- Advertisement -
- Advertisement -

మూడో విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సిఎం రేవంత్ మూడో విడత నిధులను విడుదల చేశారు. దీంతో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ కానుంది. రేపు రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. మూడో విడతలో మొత్తం 14.4 లక్షల మంది రైతులకు లాభం చేకూరనుంది. ఆగస్టు 15వ తేదీ నాటి వరకు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామని..  మాట ప్రకారం రుణమాఫీ చేశామని సిఎం రేవంత్ అన్నారు.

రూ.31వేల కోట్లతో జూలై 18 నుంచి నేటి వరకు రైతు రుణాలను మాఫీ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి చూపించామని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయాలని.. లేకపోతే, ముక్కు నేలకు రాసి, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సిఎం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News