Thursday, September 19, 2024

ఆపరేషన్ దుర్గం చెరువు

- Advertisement -
- Advertisement -

చెరువుల కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాదాపూర్ దుర్గం చెరువు ప రిరక్షణ కోసం చర్యలకు ఉపక్రమించింది. దుర్గం చెరువు ఎప్‌టిఎల్‌లో ఉన్న నెక్టార్ గార్డెన్, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సోసైటీ కాలనీ వా సులకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటిసులు జారీ చేశారు. పలు ఇండ్లకు నోటీసులను అం టించారు. వీరికి నెల రోజుల గడువిస్తున్నట్లు నోటీసులలో తెలిపారు. ఎఫ్‌టిఎల్ అక్రమించి కట్టిన ని ర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఒక్కరోజే ఈ నాలుగు కాలనీలలోని వందల ఇండ్ల వాణిజ్య సముదాయాలకు వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద నోటీసులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో దుర్గం చెరువు పరిసర కాలనీలో ఇప్పుడు నోటీసులు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎఫ్‌టిఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన దాదాపుగా 204 నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 1995 సంవత్సరంలో హుడా లే అవుట్ అనుమతి తీసుకొని నిర్మాణాలు చేయడం జరిగిందని అమర్ సోసైటీ కాలనీ వాసులు తెలిపారు. ప్రతి ఇంటికి మున్సిపాల్ అనుమతులు ఉన్నాయన్నారు.

హుడా, మున్సిపాలిటీ అనుమతితోనే ఇండ్లను నిర్మించుకున్నమని ఇప్పుడు సడెన్‌గా హైడ్రా నోటీసులు జారీ చేయడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలకు ఎఫ్ అని రెడ్ మార్క్ చేసి, బఫర్ జోన్‌లో ఉంటే బి అని, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌తో పాటు కొన్ని భవనాలకు ఎఫ్/బి అని రెడ్ మార్క్ చేశారు. నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీ, డాక్టర్స్ కాలనీలలో రాజకీయ నాయకులతోపాటు సినీ నటులు, ఐఎఎస్, ఐఆర్‌ఎస్, అధికారులతో పాటు సామాన్య ప్రజలు ఇక్కడ నివాసం ఉన్నట్లు తెలుస్తుంది. దుర్గం చెరువు అనేది ఒకప్పుడు నగరానికి శివారు ప్రాంతం కాని ఇప్పుడు హైటెక్ సిటీకి సెంటర్ పాయింట్‌గా ఉంది. ఐటి అభివృద్ధి చెందడంతో హైదరాబాద్ అంటే మాదాపూర్ అనే స్థానానికి చేరుకోవడం జరిగింది. గతంలో శివారు ప్రాంతంలో ఇండ్లను నిర్మించుకున్న సామాన్య ప్రజలతో పాటు అధికారులు, రాజకీయ నాయకులు, సినీ నటులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు నిర్మాణాలు చేయడం జరిగింది. దుర్గం చెరువు చుట్టూ ప్రక్కల వందల కొద్దీ ఇండ్లను అని అనుమతులు తీసుకొని నిర్మించారు. ఇప్పుడు ఎఫ్‌టిఎల్ అని నోటీసులు ఇవ్వడంపై ప్రతి ఒక్కరిలో గుబులు పుట్టుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం ఎఫ్‌టిఎల్ జోన్‌లోనే……
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న నివాసం ఎఫ్‌టిఎల్‌లో ఉన్నట్లు అధికారులు స్పష్టత ఇవ్వలేదు కాని ఎఫ్‌టిఎల్‌లో ఉంటే మాత్రం తాము అధికారులకు సహకరిస్తామని తిరుపతిరెడ్డి తెలిపారు. నేను ఇప్పుడు ఉన్న ఇల్లు బఫర్ జోన్‌లో ఉన్నది అని తెలిసింది. కాని నేను లే అవుట్ చేయాలేదు. కట్టిన ఇల్లును కొనుగోలు చేశాను. 2016,2017 సంవత్సరంలో అమర్ సోసైటీలో ఇల్లు కొనుగోలు చేశాను. అని అనుమతులు తీసుకొని నిర్మాణం చేశారు. ఇప్పుడు నేను నా ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని అడ్వకేట్‌కు ఇచ్చాను. అధికారులకు సహకరిస్తాము. సమయం ఇస్తే ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకొని బయటకు వెళ్తామన్నారు. ఇప్పటి వరకు నాకు ఎ అధికారి కల్వలేడు. కలిస్తే మాట్లాడి వారికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు అనేక ఇల్లీగల్ పనులు జరిగాయన్నారు. దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్‌లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని నిర్మించడాని కాని నేను ఇక్కడ ఇల్లు కొనుగోలు చేశాను. నా ఇంటిని పట్టుకొని రాజకీయం చేయడం సరి కాదు. గత పదేళ్ళలో ఎన్నో అక్రమాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News