Tuesday, April 30, 2024

అవినీతికి ఛాంపియన్

- Advertisement -
- Advertisement -
ప్రధాని మోడీపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఎన్నికల బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద
దోపిడీ పథకం ఓట్ల కోసమే ప్రధాని మోడీ
దక్షిణాదిపై దండయాత్ర పది సంవత్సరాల
పాలనలో దక్షిణాదిని పట్టించుకోని మోడీ
గుజరాత్‌కు ఎప్పుడో కేటాయించిన బుల్లెట్
రైల్‌ను ఇప్పుడు దక్షిణాదికి కేటాయిస్తామని
మేనిఫెస్టోలో చెప్పడంలో ఆంతర్యమేమిటి?
కీలక పదవులన్నీ ఉత్తరాదికే ఇచ్చారు
రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని
వయనాడు ప్రజలు ప్రధానినే
ఎన్నుకుంటున్నారు మరో 20 ఏళ్లు
రాహులే ప్రధాని కేరళ ఎన్నికల
ప్రచారంలో రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి ఛాంపియన్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వి మర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ పారదర్శకత కోసమే తెచ్చామని మోడీ చెబుతున్నారని, అదే నిజమైతే సుప్రీంకో ర్టు ఈ వ్యవస్థను ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. పారదర్శకత ఉంటే ఎలక్టోరల్ బాండ్స్ కొన్న వారిని, ము ఖ్యంగా బిజెపికి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను ఎందుకు బ యటపెట్టడం లేదన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వ యనాడ్‌తో పాటు కెసి వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజా ఎంపి నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి రా హుల్ గాంధీ ప్రధాని అవుతారని, వయనాడ్ నుంచే ఆయ న 20 ఏళ్లుగా ప్రధానిగా ఉంటారని, వయనాడ్ ప్రజలు ఎంపీ కోసం ఓటు వేయడం లేదని, ప్రధాని పదవి కోసం వేస్తున్నారని అన్నారు.

ప్రధాని మోడీ 10 ఏళ్లు వారణాసి నుంచి ప్రధానిగా ఉంటే, రాహుల్ గాంధీ 20 ఏళ్లు వయనాడ్ నుంచి ప్రధానిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేశారని, గత 20 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆయన కాకుంటే ఇంకెవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు. ఈవీఎంలు లేకుండా బిజెపికి 180 సీట్లు కూడా రావని ప్రియాంకాగాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పం దించారు. నరేంద్ర మోడీ, ఈవీఎంలు ఉన్నంత వరకు కాం గ్రెస్ అధికారంలోకి రాదని బీజేపీ నేతలే చెబుతున్నారని ఆరోపించారు. ఈవీఎంలపై తమకు అనుమానం ఉందన్నారు. ఈవీఎంలు తీసేయడానికి ప్రధాని మోడీకి ఎందు కు భయమవుతోందని ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ ద్వా రా ఎందుకు ఎన్నికలు జరపడం లేదన్నారు. ఈవీఎంలతో ప్రధాని మోడీకి ఏం సంబంధం ఉందని, బిజెపికి ఎందుకు భయమవుతోందని అడిగారు.

ప్రపంచం మొత్తం పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తుంటే, భారత్‌లోనే ఈవీఎంలను ఉపయోగిస్తున్నారన్నారు. మీరు పేపర్ బ్యాలెట్ ఉపయోగించి పరీక్ష నిర్వహించాలని, తమకు ఈవీఎంలపై నమ్మకం లే దని, పేపర్ బ్యాలెట్ ఉపయోగించడం ద్వారా నిజమేంటో తెలుస్తుందని ఆయన అన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ/ఎన్డీఏ కూటమిపై నిప్పులు చె రిగారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు అడిగే కనీస హక్కు బిజెపికి గానీ, ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీకి గానీ లేదని తేల్చి చెప్పారు. దక్షిణాదికి ఏమిచ్చారని ఓటు వేయాలని ప్రశ్నించారు. అబ్ కీ బార్ 400 పార్ అనే స్లోగన్ వినడానికి బాగానే ఉన్నప్పటికీ.. అన్ని సీట్లు రాబోవని ధీమా వ్యక్తం చేశారు.

తన 10 సంవత్సరాల హయాంలో దేశాన్ని మోడీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా భారత్‌లో అంతర్భాగమేనని గుర్తు చేశారు. ఈ మధ్యకాలం లో మోడీ ఎందుకు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు? గుజరాత్‌కు కేటాయించిన బుల్లెట్ రైలును దక్షిణాదికి కూడా ఇస్తామని ఇప్పుడే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని నిలదీశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక పదవుల్లో దక్షిణాది వారిని ఎంపిక చేశారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బిజెపిని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడో నిషేధించాయనీ పేర్కొన్నారు. వాయనాడ్‌లో పోటీలో ఉన్న ఎల్డీఎఫ్ అభ్యర్థికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని నిలదీశారు. బిజెపి అభ్యర్థి సురేంద్రన్‌కు అండగా నిలిచారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News