Sunday, September 15, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు, మెట్రో కనెక్టివిటీ

- Advertisement -
- Advertisement -

ఫ్యూచర్ సిటీకి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై అధికారులతో చర్చించిన సిఎం రేవంత్
ఔటర్ టు ఆర్‌ఆర్‌ఆర్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ తయారు చేయాలి
కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి
అధికారుల సమీక్షలో సిఎం రేవంత్ ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై సిఎం రేవంత్ అధికారులతో చర్చించారు. ఈ రూట్ మ్యాప్ గురించి అధికారులు సిఎంకు వివరించారు.ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ‘ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై’ జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూట్ మ్యాప్‌పై ముఖ్యమ్ంర రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్‌రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ తయారు చేయాలని అధికారులకు సిఎం రేవంత్ సూచించారు.

ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సిఎం సూచించారు. రోడ్డు, మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులు సమన్వయంతో పని చేయాలని సిఎం అధికారులతో పేర్కొన్నారు వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News