Tuesday, November 12, 2024

ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ సంఘాల జేఏసి నా యకులతో స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తామని,ఆ కమిటీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమా ర్క సబ్ కమిటీ చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బా బు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా, ప్రత్యేక ఆ హ్వానితులుగా కె.కేశవరావు ఉంటారని ఉద్యోగు ల జేఏసీ ప్రతినిధులతో ఆయన తెలిపారు. దీపావళి తరువాత డిపార్ట్‌మెంట్‌ల వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని సిఎం పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్ర భుత్వ సలహాదారు కేశవరావులు పోలీస్ కమాం డ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమయ్యారు. ముందుగా మధ్యాహ్నం 3.38 నిమిషాలకు 46 సంఘాల జేఏసి ప్రతినిధులైన తెలంగాణ ఉద్యో గ జేఏసి (టిజిఈజేఏసీ) చైర్మన్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ, ముజీబ్‌హుస్సేనీ, ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, శ్యాం, సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞలతో పాటు మి గతా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సిఎం సమావేశమయ్యారు. సుమారు మూడుగంటల పాటు ఈ సమావేశం జరగ్గా ప్రతి ఉద్యోగ సం ఘం నాయకుడి

నుంచి సిఎం ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వారి సమస్యలను రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం తొలి మెట్టు అని సిఎం వారితో తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని, వచ్చే మార్చి తరువాత ఆర్థిక పరమైన అంశాలపై దృష్టి సారిస్తామని సిఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పేర్కొన్నారు. అయితే కనీసం డిఏలనైనా తమకు ఇప్పించాలని జేఏసి నాయకులు సిఎంకు విజ్ఞప్తి చేయడంతో నేటి సాయంత్రంలోగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని సిఎం రేవంత్ వారికి హామీ ఇచ్చారు. 317 జీఓపై కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో త్వరలోనే కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం రేవంత్ వారితో పేర్కొన్నారు. త్వరలో మరోసారి భేటీ అవుదామని సిఎం పేర్కొన్నారు. తాను మీ కుటుంబ సభ్యుడినని, మీ అన్నలాంటి వాడిని, మీ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఆందోళన అక్కరలేదని సిఎం వారికి భరోసా ఇచ్చారు. ఉద్యోగులు, ఉద్యోగసంఘాలపై తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఉండవని సిఎం హామీనిచ్చారు.

డిసెంబర్ 09వ తేదీలోపు ఈహెచ్‌ఎస్ అమలు: లచ్చిరెడ్డి
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి (టిజిజేఏసి)ఆధ్వర్యంలో జి.నిర్మల, రామకృష్ణ, హనుమంత్‌రావు, దర్శన్ గౌడ్, ఎస్.రాములు, జే.తిరుపతి, జి.కృపాకర్ వివిధ సంఘాల నాయకులతో సిఎం రేవంత్ రెండోవిడతగా సాయంత్రం ఆరుగంటల సమయంలో గంటన్నరపాటు వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను సూచించడంతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఎలా వ్యవహారిస్తే బాగుంటుందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లచ్చిరెడ్డి ప్రజేంటేషన్ ఇచ్చారు. దీనిపై సిఎం ప్రశంసించారు. ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చు ఉండదని, ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగులు ఒక శాతం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని లచ్చిరెడ్డి తెలపడంతో సిఎం కూడా డిసెంబర్ 09వ తేదీలోగా ఈహెచ్‌ఎస్‌ను అమలు చేస్తామని వారికి హామీనిచ్చారు.

ఇక ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రంలో అసైన్డ్ భూములు కేటాయించవచ్చని, దానికి ప్రభుత్వం చట్టాలను సవరించి ఆ స్థలాలను కేటాయిస్తే ఉద్యోగులు వాటిని కొనుగోలు చేసి నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, దీనివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండదని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని లచ్చిరెడ్డి సిఎం రేవంత్‌తో తెలిపారు. దీనిపై కూడా త్వరలోనే రెవెన్యూ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దీనికి సంబంధించి విధి, విధానాలను రూపొందిస్తామని సిఎం వారికి హామీనిచ్చారు. ప్రభుత్వానికి భారం కాకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను ఉద్యోగులు సూచించాలని ఆ దిశగా మీ వంతు సహకారం ఎప్పుడూ ఉండాలని సిఎం రేవంత్ తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు సూచించారు.

తహసీల్దార్‌లను పాత జిల్లాలకు పంపడానికి సిఎం సానుకూలత
ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్‌లు రెవెన్యూకు సంబంధించి పలు అంశాలను సిఎం దృష్టికి తీసుకెళ్లగా సిఎం రేవంత్ వాటిపైసానుకూలత వ్యక్తం చేశారు. సిఎం దృష్టికి తీసుకెళ్లిన అంశాల్లో భాగంగా తహసీల్దార్ల ఎన్నికల బదిలీలకు సంబంధించి పాత జిల్లాలకు పంపడానికి సిఎం పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు. –కొత్త రెవెన్యూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయుటకు గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించే ప్రక్రియలో పూర్వ విఆర్‌ఓల సేవలను వినియోగించుకోవాలన్న ప్రతిపాదనతో పాటు ఇతర శాఖలకు పంపిన విఆర్‌ఏలను తిరిగి శాఖలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనలపై పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటానని సిఎం హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగులపై విధి నిర్వహణలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయాలని సిఎంకు ట్రెసా ప్రతినిధులు విన్నవించారు. –కొత్త మండలాలకు త్వరలో కేడర్ స్ట్రెంత్‌ను మంజూరు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి వివిధ కేడర్ల పదోన్నతులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉంది: తెలంగాణ ఉద్యోగ జేఏసి నాయకులు
సిఎం రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం తెలంగాణ ఉద్యోగ జేఏసి ప్రతినిధులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్క రిస్తుందన్న నమ్మకం ఉందని, బదిలీలు, సర్వీసు అంశాలను పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారని వారు తెలిపారు. తమ సమస్యలను సిఎం క్షుణ్ణంగా విన్నారని ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, ఆర్థిక సంబంధమైన సమస్యలను ఆర్థిక శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారన్నారు.

సిపిఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలి
సిపిఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ సిఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తున్న, కాంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం విధానం వల్ల భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి అధిక భారం అవుతుందని ఆయన తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగుల భవితను భద్రత చేకూర్చాయని సిఎంతో ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News