Sunday, April 28, 2024

కేంద్ర మంత్రి గడ్కరీతో రేవంత్ భేటీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగం పనులు, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరువరసలుగా అభివృద్ధి చేయడం, హైదరాబాద్-శ్రీశైలం నాలుగులైన్ల ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-కల్వకుర్తి రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై గడ్కరీతో చర్చించారు.

రాష్ట్రంలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని రేవంత్ బృందం విజ్ఞప్తి చేసింది. సిఆర్ఐఫ్ నిధులను పెంచాలని కోరింది. నల్గొండలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండకు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రిని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News