Wednesday, May 21, 2025

రాహుల్‌ గాంధీ విజన్‌ సాకారం కాబోతుంది: సిఎం రేవంత్‌

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర నిర్ణయాన్ని సిఎం అభినందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రధాని, కేంద్ర కేబినెట్‌కు ధన్యవాదాలు తెలిపారు.కులగణనపై రాహుల్‌ గాంధీ విజన్‌ సాకారం కాబోతుందన్నారు. రాహుల్‌ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారని చెప్పారు. దేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని సిఎం రేవంత్ అన్నారు.కాగా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News