Wednesday, November 6, 2024

మూసీపై అఖిలపక్ష సమావేశానికి సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు ఇల్లు ఇచ్చి మంచి జీవితం ఇవ్వాలనే ప్రయత్నం చేయడం తప్పా అని ముఖ్య రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మూసీ పేదలకు ఇల్లు ఇవ్వాలా? వద్దా? అని నిలదీశారు. మూసీ మురికి, దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా బ్రతుకుతున్నారు. మీరు మాత్రం ఫామ్ హౌజ్ ల్లో ఉండాలా? అని ప్రశ్నించారు. గురువారం సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్‌ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “కేటీఆర్, హరీశ్ రావులు కిరాయి వాళ్లను వెంటపెట్టుకొని హడావిడి చేస్తున్నారు. మూసీలో ఇండ్లు మునిగిపోయిన పేదలకు మీ అవినీతి సొమ్మును పంచిపెట్టండి. మీ ఖాతాలోని రూ.500 కోట్లను పేద ప్రజలకు ఇవ్వండి. అధికారంలోకి రాక ముందు లబ్బర్ చెప్పులతో తిరిగిన మీరు.. ఇప్పుడు రూ.కోట్లకు ఎలా పడగలెత్తారు?. మూసీ ప్రక్షాళనపై బిఆర్ఎస్, బిజెపి పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. మూసీపై అఖిలపక్ష సమావేశానికి సిద్ధం. హైదరాబాద్ నగరంలో ఎవరూ ఆక్రమణలకు పాల్పడ్డారో తేలుద్దాం” అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News