Sunday, April 28, 2024

హరీష్ రావు.. ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వం అన్యాయాలను గుర్తించి బిఆర్ఎస్ పార్టీని గద్దె దింపి.. ఇందిరమ్మ రాజ్యానికి మళ్లీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన 2వేల మంది గురుకుల టీచర్స్, లైబ్రేరియన్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సిఎం రేవంత్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. బిఆర్ఎస్ కుటుంబం ఉద్యోగాలు ఊడగొడితే.. మీకు ఉద్యోగాలు వస్తామని చెప్పాం.. చెప్పినట్టుగానే ఉద్యోగాలు ఇస్తున్నామని సిఎం చెప్పారు. ఆరేళ్లు పదవిలో ఉన్న వ్యక్తి అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. పదవి కోసం ఔరంగజేబు తండ్రిని జైలులో పెట్టారని.. హరీష్ రావు కూడా పదవి రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనన్నారు.

సీఎం కర్చీలో నల్లమల నుంచి వచ్చిన రైతుబిడ్డ కూర్చుంటే.. కెసిఆర్ ఓవర్వలేకపోతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాస్తు బాగోలేదని.. కుమారుడి కోసం సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టారని.. వాస్తుతో నిర్మించిన కొత్త సచివాలయం మనకు ఉపయోగపడుతుందన్నారు. మేం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాకముందే బిఆర్ఎస్ శాపనార్థాలు పెడుతున్నారని.. సాగు నీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం అసెంబ్లీకి రా అంటే.. రాకుండా కెసిఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నాడని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News