- Advertisement -
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొల్లాపూర్ మండలం జటుప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. ఆతర్వాత జటుప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సిఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సభా వేదికపై ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు.
- Advertisement -