Monday, May 19, 2025

‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి సిఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. రూ.12,600 కోట్ల బడ్జెట్ తో ఈ పథకం రూపొందించారు. ఒక్కో యూనిట్ కు రూ. 6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది.

ఈ కార్యక్రమం అనంతరం సిఎం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఆ తర్వాత సిఎం రేవంత్.. స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చేరుకోనున్నారు. కొండారెడ్డిపల్లెలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత సాయంత్రం కొండారెడ్డిపల్లె నుంచి సిఎం రేవంత్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News