Sunday, September 15, 2024

న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం

- Advertisement -
- Advertisement -

నా వ్యాఖ్యల ను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయ ని, భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉన్నాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల పై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన వి షయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా రే వంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తన కు ఆపాదించబడిన వ్యాఖ్యలను 29 ఆగస్టు, 2024 నాటి కొన్ని పత్రికలు, న్యాయవ్యవస్థ విజ్ఞతను ప్రశ్నిస్తున్నానన్న అభిప్రాయాన్ని వె లిబుచ్చాయని ఆయన అన్నారు.

అయితే తా ను న్యాయ ప్రక్రియను గట్టిగా విశ్వసిస్తానని ముఖ్యమంత్రి
పునరుద్ఘాటించారు. ఆ పత్రికా నివేదికలో ప్రతిబింబించే ప్రకటనలపై తాను బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అటువంటి నివేదికల్లో తనకు ఆపాదించబడిన వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని సిఎం రేవంత్ అన్నారు. న్యాయవ్యవస్థ దాని స్వతంత్రత పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని, భారత రాజ్యాంగం దాని నీతిని దృఢంగా విశ్వసించే వ్యక్తిగా, న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవాన్ని కొనసాగిస్తానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News